iPhone 16 Pro: ఆఫర్ అదిరిందిగా..! ఐఫోన్ ఇంత తక్కువ ధరలోనా..?

iPhone 16 Pro ప్రస్తుతం అమెజాన్‌లో రూ.1,16,900 ధరకు అందుబాటులో ఉంది, బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI, ఎక్స్చేంజ్ వంటి ఆఫర్లతో మరింత తగ్గింపు లభిస్తోంది. 6.3 అంగుళాల డిస్‌ప్లే, మెరుగైన కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్, ఫోటో ప్రియులకు ఎంతో స్పెషల్ గా ఉంటుంది.

New Update
iphone 16 pro

iphone 16 pro

ప్రస్తుతం మొబైల్ మార్కెట్‌లో iPhone 16 Pro ప్రారంభ ధర రూ.1,19,900 కాగా, అమెజాన్‌లో ఇది రూ.1,16,900 ధరకు అందుబాటులో ఉంది. HDFC, RBL బ్యాంక్ కార్డులు వాడితే రూ.4,500 తక్షణ తగ్గింపు పొందవచ్చు, అలాగే ICICI, SBI, కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డులతో రూ.4,000 వరకు తగ్గింపు కూడా అందుతోంది.

Also Read :  పవన్ కళ్యాణ్ అలాంటి వారే.. శ్రియా రెడ్డి షాకింగ్ కామెంట్స్!

నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ వాడితే అదనంగా రూ.7,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే, పాత ఐఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే మరింత తగ్గింపు పొందే అవకాశం ఉంది, ఇది iPhone 16 Pro కొనుగోలు చేయడానికి మంచి అవకాశం.

Also Read :  ఒక్క పెగ్గు తాగినా ముప్పే.. శరీరంలో జరిగేది ఇదే!

స్పెసిఫికేషన్స్:

iPhone 16 Pro స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఇది 6.3 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. A18 ప్రో చిప్‌సెట్‌తో, 16-కోర్ న్యూరల్ ఇంజిన్, గేమింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన హార్డ్‌వేర్ యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ iOS 18.2 పై నడుస్తుంది. కెమెరా పరంగా, 48 MP ఫ్యూజన్ కెమెరా, 48 MP అల్ట్రా వైడ్ సెన్సార్, 12 MP 5x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.

Also Read :  18ఏళ్ళ తర్వాత..పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్

ఫోటోగ్రఫీకి బాగా అనుకూలంగా ఉండే ఈ ఫోన్, కెమెరా కంట్రోల్ బటన్‌తో కూడా నాణ్యతను పెంచుతుంది. ఫోటో ప్రియుల కోసం ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఫోన్  డిస్‌ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్ ఇతర ఫీచర్లు కూడా అత్యుత్తమంగా ఉంటాయి. ప్రస్తుతం iPhone 16 Pro మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్లలో ఒకటి. అద్భుతమైన ఆఫర్లతో, దీన్ని తక్కువ ధరకు పొందాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం.

Also Read  : ఏపీలో దారుణం.. సినీ ఫక్కీలో డెడ్ బాడీ పార్శిల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు