Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. బాలీవుడ్‌ నటిపై దాడి

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. షాప్ ఓపెనింగ్ కోసం ఓ బాలీవుడ్ నటిని తీసుకువచ్చిన నిర్వాహకులు.. వ్యభిచారం చేయమని ఒత్తిడి చేశారు. దీంతో షాక్‌కు గురైన ఆమె 100కు ఫోన్ చేసింది. నిందితులు ఆమెను బంధించి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

New Update
Crime News : వీళ్ళసలు మనుషులేనా? చిన్నారిని చిదిమేసిన కన్నతండ్రి.. మేనమామ..అన్న! 

Hyderabad

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలో ఓ బాలీవుడ్ నటిపై దాడికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ముంబైలో ఉంటున్న ఓ బాలీవుడ్‌ టీవీ నటి ఈ నెల 18న హైదరాబాద్‌కు వచ్చింది. ఓ షాపు ఓపెనింగ్‌కు అతిథిగా రావాలని స్నేహితురాలు ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు విమాన ఛార్జీలతో పాటు పారితోషికం చెల్లిస్తారని తెలిపింది. దీంతో ఆ నటికి మాసబ్‌ట్యాంక్‌ శ్యామ్‌నగర్‌ కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతిs

ఆమెను బంధించి డబ్బులు లాక్కోని..

అక్కడ ఆమెతో పాటు ఉన్న ఇద్దరు మహిళలు తమతో కలిసి వ్యభిచారం చేయాలని డిమాండ్ చేశారు. ఓ ముగ్గురు పురుషులు ఆమె దగ్గరకు వచ్చి తమతో ఉండాలని బలవంతం పెట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే వారు ఆ నటిని గదిలో బంధించి ఆమె దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వెళ్లిపోయారు. ఆమె 100 కు కాల్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Delhi Railway station :  ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన  ఢిల్లీ రైల్వే స్టేషన్‌!

ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

 

ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు