/rtv/media/media_files/2025/02/25/BKOav4qa0j7MCQZyyeXG.jpg)
Pawan Kalyan emotional on Elephant stampede incident
ఏపీ అన్నమయ్య జిల్లా (Annamayya District) లో ఏనుగుల తొక్కిసలాట (Elephant Stampede) ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండాల కోన అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడిలో చనిపోయి ముగ్గురు భక్తులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందింస్తామని ప్రకటించారు.
Also Read : విమానం లోపల కమ్మేసిన పొగ మంచు.. ఊపిరాడకపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
మృతులకు రూ.10 లక్షలు..
ఈ మేరకు అటవీ శాఖ ఉన్నతాధికారులు, అన్నమయ్య జిల్లా అధికార యంత్రాంగాన్ని ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా బాధితుల కుటుంబాలు చనిపోయి ముగ్గురు భక్తులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులకు సూచించారు. అలాగే మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను దర్శించుకునే భక్తులకి తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇక మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించి భరోసా ఇవ్వాలని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు దిశానిర్దేశం చేశారు.
ఇది కూడా చదవండి: SLBC UPDATES: పెరుగుతున్న బురద నీరు.. ఏ క్షణమైనా కన్వేయర్ బెల్టు తెగే ప్రమాదం!
Also Read : తెలంగాణవాసులకు చల్లటి కబురు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందో తెలుసా!
కాలినడకన వెళ్తున్న భక్తులపై
శివరాత్రి సందర్భంగా దేవాలయానికి వెళ్తున్న భక్తులను ఏనుగులు తొక్కి చంపాయి. ఓబులవారిపల్లి మండలం వైకోట అడవుల్లోని గుండాలకోన మార్గంలో సోమవారం అర్థరాత్రి కాలినడకన వెళ్తున్న భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది. నీలకంఠేశ్వర ఆలయానికి వెళ్తుండగా వైకోట అటవి ప్రాంతంలో ఏనుగులు వారిపై దాడి చేశాయి. ఈ దాడిలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు మరో పురుషుడు ఉన్నాడు. బుధవారం శివరాత్రి పురస్కరించుకొని శివాలయానికి వెళ్తున్న సమయంలో ఈ విషాదం జరిగింది. మృతులు ఉర్లగట్టపోడు ఎస్టీ యానాదులుగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: మహాశివరాత్రి రోజున రాశీ ప్రకారం ఈ దానాలు చేస్తే.. సమస్యలన్నీ పరిష్కారం!