Watch Video: విమానం లోపల కమ్మేసిన పొగ మంచు.. ఊపిరాడకపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్!

అట్లాంటా నుంచి దక్షిణ కరోలినాలోని కొలంబియాకు వెళ్లే డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో ఆ విమానం హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి అత్యవసర ల్యాండ్ అయింది. అప్పటికి 94 మంది ప్రయాణికులు ఉన్నారు.

New Update
Delta flight forced to make emergency landing in Atlanta after haze fills cabin

Delta flight forced to make emergency landing in Atlanta after haze fills cabin

ఈ మధ్య విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తరచూ ఏదో ఒక ప్రాంతంలో విమానంలో సమస్యలు తలెత్తి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇప్పటికి ఇలాంటి ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరోసారి అలాంటి సంఘటనే జరిగింది. ఓ విమానంలో తలెత్తిన సమస్య లోపల ఉన్న ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసింది. విమానంలో ఒక్కసారిగా తెల్లటి పొగమంచు కమ్ముకుంది. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు గజగజ వణికిపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు

Delta flight

సోమవారం ఉదయం అట్లాంటా నుంచి దక్షిణ కరోలినాలోని కొలంబియాకు వెళ్లే డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానం లోపల సిబ్బంది సమాచారంతో హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి అత్యవసర ల్యాండ్ అయింది. ఈ మేరకు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు FAA తెలిపింది.

Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్‌... 140 సోషల్‌ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!

విమాన డెక్‌లో పొగ వచ్చే అవకాశం ఉందని సిబ్బంది నివేదించిన తర్వాత విమానం ఉదయం 9 గంటల ప్రాంతంలో విమానాశ్రయానికి తిరిగి వచ్చిందని సంఘటనపై దర్యాప్తు చేస్తున్న ఫెడరల్ ఫ్లైట్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

94 మంది ప్రయాణికులు

అట్లాంటా నుండి బయలుదేరిన ఈ బోయింగ్ 717 విమానంలో దాదాపు 94 మంది ప్రయాణికులు ఉన్నారు. అలాగే ముగ్గురు విమాన సిబ్బంది, ఇద్దరు పైలట్లతో ఆ విమానం ప్రయాణించింది. ఇక అత్యవసర విమానం ల్యాండ్ అయిన తర్వాత, ప్రయాణీకులు త్వరగా బయటకు వెళ్లగలిగేలా స్లైడ్‌లను అమర్చామని డెల్టా ప్రతినిధి సమంతా మూర్ ఫ్యాక్టియు తెలిపారు.

Also Read: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!

ఈ భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న తర్వాత ఎయిర్‌లైన్ స్పందించింది. తమ కస్టమర్లు, ప్రజల భద్రత కంటే మరేమీ తమకు ముఖ్యం కాదు అని తెలిపింది. ఇలా జరగడం వల్ల తమ కస్టమర్లకు క్షమాపణలు కోరుతున్నాము అని పేర్కొంది. ఈ మేరకు పొగమంచుకు కారణాన్ని పరిశీలిస్తున్నామని ఎయిర్‌లైన్ తెలిపింది. అయితే ఇలా జరగడంపై తమ ఎక్స్‌పీరియన్స్‌ను విమానంలో ప్రయాణిస్తున్న వారు పంచుకున్నారు. విమానం టేకాఫ్ అయినప్పుడు అది పొగమంచుతో నిండిపోయిందని.. కొన్నిసార్లు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారిందని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు