/rtv/media/media_files/2025/04/15/4Wzqq3ewqqRHqxbHez4J.jpg)
AP Cabinet Meeting
AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Also Read: VIRAL VIDEO: బెంగళూరులో సినిమా రేంజ్ లో రోడ్డు ప్రమాదం.. చూస్తే షాక్ అవుతారు!
AP Cabinet Meeting Key Decisions
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Also Read: Ram Mandir: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !
విశాఖలోని ఐటీహిల్ -3 పైన టీసీఎస్‌కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉరుస క్లస్టర్‌కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయించింది. బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్ కన్సార్టియమ్‌కు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Also Read:Bangladesh: నిప్పుతో గేమ్స్ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్
Also Read : అమెరికాకు చైనా మరో షాక్.. ఆ విమనాలు కొనొద్దని ఆదేశం
sc-classification | ap-cabinet-meeting | ap cm chandra babu naidu | AP Assembly 2025 | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu