TDP Office Attack Case : వాళ్లిద్దరూ దేశం విడిచి వెళ్లద్దని సుప్రీంకోర్టు కీలక ఆదేశం..ఎవరో తెలుసా ?
చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయంపై దాడి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వైసీపీనేతలు జోగి రమేశ్, దేవినేని అవినాష్ సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారించింది. దేవినేని అవినాష్, జోగి రమేశ్ సహా 20 మందికి బెయిల్ మంజూరు చేసింది.