AP Crime: 2021లో పెళ్లి.. ఆగని వేధింపులు.. భార్య సూసైడ్!

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం గ్రామంలో వరకట్నం కోసం వేధించడంతో ముగ్గులో వేసే రంగుని నీటిలో కలిపి తాగి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై భర్తతోపాటు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

author-image
By Vijaya Nimma
New Update
nellur crime

nellur crime

AP Crime: నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వరకట్నం కోసం వేధించడంతో ముగ్గులో వేసే రంగుని నీటిలో కలిపి తాగి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  2021వ సవత్సరంలో బోగోలు మండలం తాటిచెట్లపాళెం గ్రామానికి చెందిన బచ్చింగారి సుగుణ (23)కు విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం గ్రామానికి చెందిన హరికృష్ణతో వివాహమైంది.

వరకట్నం వేధింపులతో.. 

వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయిన ఏడాది తర్వాత అదనపు కట్నంగా రూ.7 లక్షలు తీసుకురావాలని భర్త, అత్తమామ నర్సమ్మ, నాగూరు, ఆడపడుచు నాగలక్ష్మి కలిసి సుగుణను వేధింస్తున్నారు. ఈ గోడవ బుధవారం తారస్థాయికి చేరటంతో.. మనస్తాపం చెందిన సుగుణ ముగ్గు రంగుని నీళ్లలో కలిపి తాగింది. ఆమె స్పృహ కోల్పోయిన సాయంత్రం వరకు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఇరుగు పొరుగున్న బంధువులు ఈ విషయం గుర్తించారు. తర్వాత సుగుణ తల్లి అన్నమ్మకు సమాచారాన్ని ఇచ్చారు.

ఇది కూడా చదవండి: కుక్కర్ నుండి నీరు లీక్ అవుతుందా.. ఇలా అరికట్టండి

వెంటనే కుటుంబ సభ్యులంతా.. పెద్దపాళెం గ్రామానికి చేరుకున్నారు. అనంతరం సుగుణను రాజుపాళెంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు.  అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తన కుమార్తె మృతిపై అనుమానం ఉందంటూ.. హరికృష్ణ, నర్సమ్మ, నాగూరు, నాగలక్ష్మిలపై అన్నమ్మ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కాగా... ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో ఈ ఊరిలో వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. మ్యాచ్‌పై హరికృష్ణ, అతని తండ్రి నాగూరు బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నారని, సుగుణను కట్నం కోసం వేధించడం వల్ల ఆత్మహత్య చేసుకుందని  ఆ గ్రామంలో అందరు అనుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై ఎస్సై నరేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: అధిక కొలెస్ట్రాల్ ఉంటే పాదాల్లో ఈ లక్షణాలు ఉంటాయి


ap-crime-news | ap crime latest updates | ap crime updates | latest-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు