Free Gas Cylinder: ఫ్రీ సిలిండర్ మరో 5 రోజులే.. వెంటనే బుక్ చేసుకోండి.. ఏపీ సర్కార్ కీలక ప్రకటన!

దీపం-2 పథకంలో భాగంగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ మార్చి 31 వరకే అవకాశం  ఉందని ఇప్పటివరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని ఆహార పౌరసరఫరాల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ప్రతి ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామన్నారు.

New Update
Free Gas Cylinder

Free Gas Cylinder

Free Gas Cylinder: దీపం-2 పథకం లో భాగంగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ మార్చి 31 వరకే అవకాశం  ఉందని ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలని ఆహార పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామన్న హామీ మేరకు కూటమి ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత గ్యాస్ సిలిండర్స్ వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏపీలో సూపర్ సిక్స్ హామీని కూటమి సర్కార్ నిలబెట్టుకుంటోందన్నారు. ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుందన్నారు.

Also read :  తెల్లటి పటికతో ముఖాన్ని తెల్లగా మార్చుకోండి..ఇలా చేయండి
  
పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ చేస్తారని మంత్రి నాడేండ్ల అన్నారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ అవుతుందన్నారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అయితే వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కూడా ఉందని మంత్రి చెప్పారు ప్రతి ఏడాది ఏప్రిల్ - జూలై (01), ఆగష్టు –నవంబర్ (01), డిసెంబర్ –మార్చి (01) నెలల మధ్య ఉచిత గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకోవచ్చునని, ఎటువంటి సమాచారం లోపం ఉన్న టోల్ ఫ్రీ నెం.1967కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు.

Also read :  థియేటర్లో మొత్తం మ్యాడ్, మ్యాడ్.. 'MAD Square' ట్రైలర్ చూశారా!

కుటుంబాల జీవ‌న ప్రమాణాల‌ను మెరుగుప‌రిచే ఉద్దేశంతో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా  దీపం-2 ప‌థ‌కం  రూపొందించడం జరిగిందన్నారు. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లోబుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ ఇస్తారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ అవుతుందన్నారు.ఒక సంవత్సరంలో  3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారు. అయితే  వీటిని ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
 Also read :  Bhatti Vikramarka : కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు .. భట్టి వార్నింగ్!

ఎవరు ఆర్వూలంటే?

రేషన్‌కార్డు ఉన్న గ్యాస్‌ వినియోగదారులంతా ఫ్రీ గ్యాస్​ సిలిండర్‌ పొందేందుకు అర్హత ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. గ్యాస్‌ కనెక్షన్‌కు ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ నెంబర్ లింక్ అయ్యాయో లేదో చూసుకోవాలి. బ్యాంకు అకౌంట్ యాక్టివ్‌లొ లేకపోతే వెంటనే పునరుద్ధరించుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ స్కీమ్ ప్రారంభం నుంచి అధికార యంత్రాంగం మండలాల వారీగా లబ్ధిదారులను చాలా వరకు అప్రమత్తం చేయడంతో ఎక్కువ శాతం మంది ఇప్పటికే లబ్ధి పొందారు. ఫ్రీ గ్యాస్ సిలిండర్‌ తీసుకున్న వారికి నిర్ణీత వ్యవధిలో సొమ్ము వారి బ్యాంక్​ అకౌంట్​లో జమ అవుతుంది. పలువురికి సాంకేతిక కారణాలతో డబ్బులు అకౌంట్​లో పడలేదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు తొలి ఫ్రీ గ్యాస్ సిలిండరు పొందని వారు ఉంటే వెంటనే బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Also read:  NTR: ''అమ్మలు హ్యాపీ బర్త్ డే'' భార్యకు ఎన్టీఆర్ విషెస్.. ఫొటోలు వైరల్

01నవంబర్ 2024న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా దీపం 2 పథకానికి శ్రీకారం చుట్టారు.  దీపం -2 పథకంతో ప్రతి పేద వాడి ఇంట్లో దీపపు కాంతులు విరాజిల్లుతాయని ప్రభుత్వం భావిస్తోంది.కుటుంబాల జీవ‌న ప్రమాణాల‌ను మెరుగుప‌రిచే ఉద్దేశంతో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా  దీపం-2 ప‌థ‌కం  రూపొందించడం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇతర వివరాలకు  టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: నల్ల ద్రాక్ష, పచ్చని ద్రాక్షలో ఏది మంచిది.. ఏది ఆరోగ్యానికి ఉపయోగకరం?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు