ముస్లింలతో చంద్రబాబు ముఖాముఖి-LIVE
నెల్లూరు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడు ముస్లింలతో సమావేశమయ్యారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి చేయనున్న కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఈ సమావేశం లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
నెల్లూరు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడు ముస్లింలతో సమావేశమయ్యారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి చేయనున్న కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఈ సమావేశం లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
నెల్లూరు టీడీపీ లోక్‌సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్‌పై కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశామన్నారు వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. విదేశాల్లోని పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదన్నారు. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఎమ్మెల్యే కాకణి వృత్తి మారలేదు.. బుద్ది మారలేదు అని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి సోమిరెడ్డి. కాకణి ఎన్నికల్లో కల్తీ మద్యం తాగించి ప్రజలను చంపెందుకు చూస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కి పిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ వేశారు. భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన ఆర్డీవో ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి మసునూరు టోల్ ప్లాజా దగ్గర లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఏపీ పదో తరగతి ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. పరీక్షలకు సంబంధించిన వాల్యుయేషన్, కోడింగ్, డీ కోడింగ్, కంప్యూటరీకరణ అన్ని పూర్తవ్వడంతో అధికారులు ఫలితాలను ఆన్ లైన్ లో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు.
పరిపూర్ణానందస్వామి తాజాగా చంద్రబాబు ఇంటికి వెళ్ళారు. టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. హిందూపురం ఎంపీ సీటు ఆశించిన ఆయన బీజేపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో హైకమాండ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
రాష్ట్రంలో మద్యం తయారీ, అమ్మకాలపై ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. నకిలీ మద్యంను అధిక ధరకు అమ్ముకుంటూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ గురువారం రిలీజ్ కానుంది. ఏప్రిల్ 18న ఏపీ, తెలంగాణతోపాటు మొత్తం 96 లోకసభ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది ఈసీ. మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.