Hindupuram : హిందూపురంలో ఉద్రిక్తత...టీడీపీ వశమైన మున్సిపల్ చైర్మన్

హిందూపరం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీలు చైర్మన్ పీఠం కోసం గట్టిగా ప్రయత్నించాయి. అయితే టీడీపీకి 21 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీతో కలిపి 23 మంది బలంతో టీడీపీ అభ్యర్థి రమేష్ ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎంపికయ్యాడు.

author-image
By Madhukar Vydhyula
New Update
Hindupur Municipal Chairman

Hindupur Municipal Chairman

Hindupuram : శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందూపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపాయి.  ఈ పీఠాన్ని దక్కించుకోవడానికి అధికార తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పడ్డారు. రెండు పార్టీలు కూడా తమ కౌన్సిలర్లను కాపాడుకోవడానికి క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. సోమవారం ఎన్నిక ఉండడంతో తమతమ కౌన్సిలర్లతో మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు.మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక శాసన సభ్యుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అక్కడే మకాం వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముందురోజే హిందూపురానికి చేరుకున్న బాలకృష్ణ కౌన్సిలర్లు చేయి జారిపోకుండా చక్రం తిప్పారు.

Also Read: Tanuku SI: పిల్లల్ని, విజ్జిని చూస్తుంటే బాధేస్తోంది...కంటతడి పెట్టిస్తున్న తణుకు ఎస్సై మూర్తి చివరి మాటలు!

గతంలో హిందూపురం ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించిన వైసీపీకి చెందిన ఇంద్రజ పార్టీ ఫిరాయించారు. గత ఏడాది ఆగస్టులో ఆమె వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకొన్నారు. మొత్తం ఎనిమిది మంది వైసీపీ కౌన్సిలర్లతో కలిసి ఆమె టీడీపీలో చేరారు. ఫలితంగా ఛైర్‌పర్సన్ ఎంపిక అనివార్యమైంది. చేరికలతో కలుపుకొని తెలుగుదేశం పార్టీ బలం 23కు చేరుకుంది. వైసీపీ కౌన్సిలర్ల సంఖ్య 17కు పడిపోయింది. దీంతో టీడీపీకే ఛైర్మన్‌ సీటు దక్కింది. చైర్మన్‌గా రమేష్‌ కు అనుకూలంగా 23 మంది చేతులెత్తడంతో ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.

Also Read: Kumbh Mela : కుంభమేళాలో వసంతపంచమి అమృతస్నానాలు.. ఎంతమందంటే..

హిందూపురం మున్సిపల్‌ చైర్పర్సన్‌ ఎన్నిక సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హిందూపురం పట్టణంలో 144 సెక్షన్‌, సెక్షన్‌ 30 పోలీస్‌ ఆక్ట్‌ అమలు చేశారు.ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలు పరిరక్షించడానికి ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలులో మున్సిపల్‌ కమిషనర్‌ అనుమతించిన వ్యక్తులు మాత్రమే ప్రవేశించేందుకు అనుమతించారు. పట్టణంలో 144 సెక్షన్‌ అమల్లో ఉండటంతో ప్రజలు గుంపులుగా కూడకూడదని పోలీసులు హెచ్చరించారు. అత్యంత కీలకమైన ఈ ఎన్నిక నేపథ్యంలో పట్టణంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం … విజయం సాధించిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని, డీజేలు, బాణాసంచా వంటి కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు ప్రకటించిన నియమాలను అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు తప్పక పాటించాలని కోరారు.  కాగా తీవ్ర ఉత్కంఠ రేపిన మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Elon Musk: మా సిబ్బంది వారానికి 120 గంటలు పని చేస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు