Chiranjeevi - Mark Shankar: పవన్ కుమారుడు మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్.. చిరంజీవి సంచలన ట్వీట్

మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి ట్వీట్ చేశారు. ‘‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అతడు ఇంకా కోలుకోవాలి. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఉంటాడు. మార్క్ శంకర్  కోలుకోవాలని మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశాడు.

New Update
పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్ కాళ్లూ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా దట్టమైన నల్లటి పొగ ఎక్కువగా పీల్చడంతో అస్వస్థతకు గురయ్యాడు. అతడికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పవన్ ఫ్యాన్స్, మెగా అభిమానులు, జన సేన కార్యకర్తలు, జన సైనికులు పూజలు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు

చిరంజీవి ట్వీట్

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి.. మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ అందిచారు. మా బిడ్డ క్షేమంగా ఇంటికొచ్చేశాడని.. కానీ అతడు ఇంకా కోలుకోవాలి అని తెలిపాడు. ఈ మేరకు అతడు ట్వీట్ చేశాడు. ‘‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో  త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో.. మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు. 

ఇది కూడా చదవండి: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి

రేపు హనుమత్ జయంతి.. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి.. ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో.. ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్  కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు  తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చాడు. 

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

(megastar chiranjeevi latest | Pawan Kalyan | pawan kalyan son mark shankar | pawan son mark shankar | latest-telugu-news | telugu-news)

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు