Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఈ సిలబస్‌ను ఏపీ డీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. కాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం. సిలబస్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.
MEGA_DSC_2024_Suggestive_Syllabus-27-11-2024.pdf
Also Read : వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు!
నాడు 6100.. నేడు 16,347...!
ఇటీవల మంత్రి లోకేష్ అసెంబ్లీలో మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. వాస్తవానికి నవంబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించినట్లు చెప్పారు. ఉపాధ్యాయ నియామకాల్లో వయో పరిమితి పెంపు డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్నామని.. దీనిపై అన్ని శాఖల మధ్య ఫైల్ సర్క్యూలేషన్‌లో ఉందని, ఎంత వయోపరిమితి పెంచుతామనేది స్పష్టత రాకపోవడంతో ఈ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కాస్త ఆలస్యం అయిందని అన్నారు.
Also Read : ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త!
సంక్రాంతి లోపు...
కాగా వచ్చే ఏడాది సంక్రాంతి లోపే మెగా డీఎస్సీ ద్వారా 16,347 ప్రభుత్వ టీచర్ కొలువుల నియామకాలను పూర్తీ చేయాలనీ టార్గెట్ పెట్టుకున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. ఇప్పటికి అదే విధంగా అడుగులు వెస్తూమని అన్నారు. అధికారులు నోటిఫికేషన్ అంశంపై కార్యాచరణ చేపట్టారని.. అది తుది దశకు వచ్చినట్లు చెప్పారు. కాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు చేశారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 6100 ఉద్యోగాలతో డీఎస్సీని ప్రకటించిందని.. అది కేవలం మాట వరకే ఉంది తప్ప.. గత వైసీపీ ప్రభుత్వంలో డిఎస్సీ ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు.
Also Read : పెళ్లిపై ఆ వార్తలన్నీ ఫేక్.. నాగచైతన్య- శోభిత సంచలన ప్రకటన!
Also Read : కాంగ్రెస్ నేత హనుమంతరావు కారుపై రాళ్ల దాడి!