Andhra Pradesh: టెట్, మెగా డీఎస్సీపై మంత్రి లోకేష్ కీలక నిర్ణయం..
ఏపీలో మెగా డిఎస్సీని ఎటువంటి విమర్శలకు తావీయకుండా పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. టెట్ నోటిఫికేషన్ విడుదల, మెగా డీఎస్సీకి సంబంధించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. డీఎస్సీ ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు.