AP: ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త!

ఏపీలో ప్రభుత్వ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. అధికారులు హార్డ్‌ వర్క్‌ కాకుండా స్మార్ట్‌ వర్క్‌ చేయాలని.. 24 గంటలు పనిచేసే రోజులు పోయాయి అన్నారు. సాయంత్రం 6 తరువాత కార్యాలయాల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు.

New Update
CBNN

Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. అమరావతి సచివాలయంలో జరిగిన 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఉద్యోగులు స్మార్ట్ వర్క్ చేయాలని.. సాయంత్రం 6 తర్వాత ఆఫీస్‌లో ఉండొద్దని చెప్పారు. తాను కూడా సాయంత్రం 6 గంటలకే సచివాలయం నుంచి వెళ్లిపోతానని.. ఉద్యోగులు హార్డ్ వర్క్ వద్దని.. స్మార్ట్ వర్క్ చేయాలన్నారు.

Also Read:  Cinema: 47 ఏళ్లకు పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజు..వధువు ఎవరో తెలుసా?

సాయంత్రం 6 గంటల తర్వాత...

గతంలో ఎక్కువ గంటలు కార్యాలయంలో ఉండి పనిచేసే సంస్కృతి ఉండేదని.. ఇప్పుడు టెక్నాలజీ కారణంగా ఆ అవసరం లేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత ఉద్యోగులు ఉండొద్దనేది ఇప్పుడు తన విధానం అని తేల్చి చెప్పారు. . అమరావతి సచివాలయ ఉద్యోగులతో సహా ఏ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ గంటలు కష్టపడాల్సిన పనిలేదని చెప్పారు. స్మార్ట్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు వస్తాయని.. అందుకే తాను కూడా సచివాలయం నుంచి 6 గంటలకే ఇంటికి వేళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

Also Read:  ఏం పీక్కుంటారో పీక్కోండి RGV సంచలన వీడియో!

 గతంలో ఎక్కువ సమయం పనిచేయాల్సి వచ్చిందని.. ఇప్పుడు ఎక్కవ పని కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని.. అందుకే సాయంత్రం 6 గంటల తర్వాత మీటింగులను వీలున్నంత వరకూ తగ్గించేందుకు ప్రయత్నిస్తామన్నారు. 

గత ఐదేళ్ల గురించి మర్చిపోదామనుకుంటున్నాను.. కానీ ఆనాటి విధ్వంసం అందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రినైనా రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థలను పునర్నిర్మించడానికి సమయం పడుతోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టకుండా రహస్యంగా ఉంచారని.. తమ ప్రభుత్వం ప్రస్తుత జీవోలతో పాటు గత ఐదేళ్లవీ ఆన్‌లైన్‌లో పెడతామని వివరించారు.

Also Read: AP : తీవ్ర వాయుగుండం..ఏపీలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌!

 ప్రజల్ని హింసించే వ్యక్తులు, శక్తులపై ఉదాసీనంగా వ్యవహరించినా సమాజానికి నష్టమే అన్నారు.ప్రజాస్వామ్యాన్ని విశ్వసించాలి.. రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు ముఖ్యమంత్రి. నేతలు, అధికారులు, రాజ్యాంగం ద్వారా ఉన్నతస్థాయికి వచ్చినవారందరం ప్రజలకు ఎలా ఉపయోగపడతామో ఆలోచించాలన్నారు. రాజ్యాంగం విషయంలో పిల్లలకు కూడా పూర్తి అవగాహన రావాలి అన్నారు. సంపదను చివరి వ్యక్తి వరకు తీసుకుపోవడానికి కొన్ని సమస్యలున్నాయన్నారు. 

Also Read: Pawan: పిఠాపురంలో నాలుగు ప్రధాన రైళ్లు..రైల్వే మంత్రితో పవన్ భేటీ!

అందరికి మాట్లాడే హక్కు, భావ ప్రకటనా హక్కులు ఉన్నా.. గత ప్రభుత్వంలో అధికారులు దానిని సరిగ్గా అమలు చేయలేదని లోకేష్‌ అన్నారు. గత ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు చేయనందుకే ప్రజలు ప్రజాస్వామ్యంతో తీర్పు ఇచ్చారన్నారు. మనదేశం సూపర్‌పవర్‌గా ఎదగడానికి రాజ్యాంగమే కారణం అన్నారు. పిల్లలే దేశ భవిష్యత్తు కాబట్టి బాలల రాజ్యాంగం పుస్తకాన్ని వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు