పెళ్లిపై ఆ వార్తలన్నీ ఫేక్.. నాగచైతన్య- శోభిత సంచలన ప్రకటన!

నాగచైతన్య- శోభిత పెళ్లి వీడియోను డాక్యుమెంటరీ రూపంలో ఓటీటీలో విడుదల చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వైరలవుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా నాగచైతన్య టీమ్ స్పందించింది. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది.

New Update
Naga Chaitanya-Sobhitha,

Naga Chaitanya- Sobhita

Naga Chaitanya- Sobhita: అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ళ త్వరలో మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరి పెళ్లి వీడియోను డాక్యుమెంటరీ రూపంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాదు నెట్ ఫ్లిక్స్  భారీ ధరకు ఈ రైట్స్ కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, తాజాగా నాగచైతన్య- శోభిత టీమ్ ఈ వార్తలపై స్పందించారు. డాక్యుమెంటరీ రూపంలో పెళ్లి వీడియో అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో నాగచైతన్య- శోభిత ఉన్నట్లు తెలిపారు. దీంతో ఈ రూమర్లకు చెక్ పడింది.

Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!

 డిసెంబర్ 4న వివాహం

నాగచైతన్య వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్థూడియోస్ లోని ఏఎన్నార్ విగ్రహం ముందు జరగనుంది. ఏఎన్నార్ ఆశీస్సులు కొత్త జంటపై ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబ సభ్యులు అక్కడ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే వివాహ ఆహ్వానానికి సంబంధించిన శుభలేఖలను కూడా పంచడం మొదలు పెట్టారు. చై- శోభిత పెళ్ళికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులతో సహా  300 మందికి పైగా గెస్టులు  హాజరు కానున్నట్లు సమాచారం. 

ఇది ఇలా ఉంటే.. నాగచైతన్యతో పాటు అతని తమ్ముడు అఖిల్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అఖిల్ నవంబర్ 26న జైనాబ్ రవద్జీ అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు. వచ్చే ఏడాది వీరి వివాహం జరగనుందట. జైనాబ్ రావ్‌డ్జీ అప్పుడెప్పుడో ‘మీనాక్షి’ అనే సినిమా కూడా చేసినట్లు సమాచారం. ఇక జైనాబ్ రావ్‌డ్జీ ఒక ఆర్టిస్టు అని కూడా సమాచారం. గతంలో హైదరాబాద్‌లో రిఫ్లెక్షన్ పేరుతో కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ఓ పెయింట్ ఎగ్జిబిషన్ పెట్టింది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నట్లు తెలుస్తోంది. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు