/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/vh-jpg.webp)
Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కారుపై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేయడం కలకలం రేపింది. ఈరోజు ఉదయం సుమారు 4 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వి.హనుమంతరావు ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఫార్చునర్ కారును వేరే వాహనంతో ఢీకొని, ఆ తరువాత పెద్ద బండరాళ్లతో కారుపై విసిరారు. ఈ క్రమంలో కారు డ్యామేజ్ అయింది. ఈ ఘటనపై సీరియస్ అయిన హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారం చేపట్టారు. కాగా ఒక సీనియర్ నేత హనుమంతరావును టార్గెట్ చేస్తూ జరిగిన దాడిని పలువురు కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు.
హైదరాబాద్ లోని వీహెచ్ ఇంటి దగ్గర కలకలం.
— RTV (@RTVnewsnetwork) November 27, 2024
ఇంటి ముందు పార్క్ చేసిన VH కారుపై రాళ్లు రువ్విన దుండగులు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన వీహెచ్.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.#VHanumanthaRao #LatestNews #Incident #RTV pic.twitter.com/lnwIFcUmaF