Aghori: శ్రీశైలంలో అఘోరీకి బిగ్ షాక్.. అనుమతి కోసం వెనక్కి వెళ్లి..! లేడీ అఘోరికి చేదు అనుభవం ఎదురైంది. శ్రీశైలం టోల్‌గేట్ దగ్గర పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. బట్టలు కట్టుకుని వస్తేనే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. దీంతో వెనక్కి వెళ్లి వస్త్రాలు వేసుకుని వచ్చి శ్రీశైలం మల్లన్నను అఘోరి దర్శించుకుంది. By Seetha Ram 10 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి అఘోరి వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. ఇదివరకు తెలంగాణలో నగ్నంగా తిరుగుతూ పలు ఆలయాలను దర్శించుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులతో హాట్ టాపిక్ గా మారింది. ఇక అక్కడ నుంచి వచ్చి ఏపీలో ప్రత్యక్షమైంది. రాష్ట్రంలో పలు ఆలయాలను సందర్శిస్తుంది. ఈ క్రమంలో తాజాగా శ్రీశైలంలో ప్రత్యక్షం కాగా.. అక్కడ అఘోరీకి చేదు అనుభవం ఎదురైంది. ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి అఘోరికి చేదు అనుభవం శ్రీశైలం టోల్‌గేట్ దగ్గర పోలీసులు అఘోరీని అడ్డుకున్నారు. బట్టలు కట్టుకుని వస్తేనే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. దీంతో వెనక్కి వెళ్లి వస్త్రాలు వేసుకుని వచ్చి శ్రీశైలం మల్లన్నను అఘోరి దర్శించుకుంది. అంతకుముందు సున్నిపెంటలో దుర్గ అనే మహిళను అఘోరీ పరామర్శించింది. సైసా అనే యువకుడి చేతిలో మోసపోయిన దుర్గకు ధైర్యం చెప్పి ఆమె ఇంట్లోనే అఘోరి భోజనం చేసింది. ఇది కూడా చూడండి: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్ ఇదిలా ఉంటే గత నెల రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అఘోరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తాను ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించడంతో పోలీసులు ముందుగా అరెస్ట్ చేసి రెండు రోజులు నిర్బంధించారు. ఆ తర్వాత విడిచిపెట్టడంతో ఏపీకి మకాం మార్చింది. ఇక్కడ అడుగు పెట్టగానే వైజాగ్ సమీపంలోని టోల్ గేట్ వద్ద రచ్చ చేసింది. ఇది కూడా చూడండి: దారుణం.. టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై.. అనంతరం శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించగా.. పోలీసులు ఆలయంలోపలకి అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మార్పణం చేసుకుంటానని బెదిరించింది. అనంతరం లేడీ సెక్యురిటీ ఆపి ఆమెకు వస్త్రాలు ధరించి ఆలయంలోకి అనుమతించారు. ఇక అక్కడ నుంచి బయలు దేరిన అఘోరి కారుకు యాక్సిడెంట్ అయింది. ఇది కూడా చూడండి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అనంతరం కారును రిపేర్ కి ఇచ్చి కాలినడకన యాగంటి క్షేత్రానికి బయల్దేరింది. దీంతో ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు, ప్రజలు రావడంతో పోలీసులు భద్రత ఏర్పాలు చేశారు. అయితే తాను మాత్రం పోలీసు వెహికల్ ఎక్కనని మొండికేసింది. ఇక కాలినడకనే యాగంటి క్షేత్రానికి వెళ్లి దర్శించుకుని ఇప్పుడు శ్రీశైలం చేరుకుంది. #police vs aghori #police #lady aghori #ap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి