దారుణం.. టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నీట్ పరీక్ష కోసం కోచింగ్ వచ్చిన విద్యార్థిని ఇద్దరు టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ ఆరు నెలల పాటు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. By Kusuma 10 Nov 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి కోచింగ్ కోసం వచ్చిన ఓ విద్యార్థిని ఇద్దరు టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేసిన దారుణ ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఫతేపుర్‌కి చెందిన ఓ విద్యార్థి వైద్య విద్య ప్రవేశానికి నీట్ కోచింగ్ కాన్పూర్‌లో తీసుకుంటుంది. 2022 డిసెంబర్‌లో ఆమె ఆ కోచింగ్ సెంటర్‌లో చేరగా.. జనవరి 1న న్యూఇయర్ పార్టీ వేడుకలు అని పిలిచారు. ఇది కూడా చూడండి: Amla: కార్తీక మాసంలో ఇంట్లో ఈ మొక్క నాటితే.. ఐశ్వర్య సిద్ధి తధ్యం! కూల్ డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి.. చాలా మంది విద్యార్థులు వస్తారని, తను కూడా రావాలని స్నేహితుడు ఫ్లాట్‌కి పిలిచాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కేవలం తను మాత్రమే ఉంది. ఆమెకు కూల్ డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి ఇద్దరు టీచర్లు అత్యాచారం చేసి, వీడియో రికార్డు చేశారు. ఆ తర్వాత అదే ఫ్లాట్‌లో ఆరు నెలల పాటు ఆమెను బంధించి అత్యాచారం చేశారు. ఇది కూడా చూడండి: Green Tea: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? ఈ విషయం బయటకు చెప్పవద్దని, ఒకవేళ చెబితే వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు. బయటకు తెలిస్తే కుటుంబ పరువు ఏమవుతుందని ఆలోచించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదట. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని అమ్మాయి ఇంటికి వెళ్లిపోయింది. కానీ ఇటీవల మరో అమ్మాయిని కూడా ఇలానే వేధిస్తున్న వీడియో ఆమెకు కనపడింది. ఇది కూడా చూడండి: తొలి టీ20లో భారత్ విజయం.. అదరగొట్టిన శాంసన్ దీంతో ధైర్యం చేసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులైన ఇద్దరు టీచర్లను అరెస్టు చేశారు. అత్యాచారం, అక్రమ నిర్భంధం, నేరపూరిత బెదిరింపు, పోక్సో నేరాల కింద అరెస్ట్ చేసినట్లు కాన్పుర్ పోలీసులు తెలిపారు. ఇది కూడా చూడండి: ఇక్కడ చేసిన ఫుడ్ తిన్నారో.. ఒక్కసారికే పైకి పోవడం గ్యారెంటీ! #uttarpradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి