AP: బుర్రుందా..ఏం మాట్లాడుతున్నారు..నేతలపై చంద్రబాబు సీరియస్
యూరోప్ తెలుగు డయాస్పోరాలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమావేశం తర్వాత ఆయనను మందలించారని తెలుస్తోంది. ఎందుకు వచ్చామో ఆ పని చేయాలని హితవు పలికారు.
యూరోప్ తెలుగు డయాస్పోరాలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమావేశం తర్వాత ఆయనను మందలించారని తెలుస్తోంది. ఎందుకు వచ్చామో ఆ పని చేయాలని హితవు పలికారు.
ఏపీ BJPకి కొత్త చీఫ్ రావడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. వచ్చే నెలాఖరు ఈ అంశంపై పార్టీ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
పరిశ్రమల శాఖ మంత్రి దావోస్ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని సీఎం చంద్రబాబు ముందే అన్నారు. లోకేష్ భవిష్యత్లో ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా కాబోయే CM లోకేషే అని చెప్పారు.
ఏపీకి కొత్త బీజేపీ చీఫ్ ను నియమించేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. కడప నుంచి రామచంద్రారెడ్డి, విశాఖ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్, నెల్లూరు నుంచి ఇసక సునీల్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఎంపిక పూర్తి అయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో జనాభా పెరుగుదలను ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కల్పిస్తూ చట్టం తీసుకొస్తామని తెలిపారు. భవిష్యత్తులో జనాభా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీశైలం ఆలయంలో అంతర్గత కలహాలు భగ్గుమన్నాయి. ఆరుద్రోత్సవ సుప్రభాతం, హారతి సేవల్లో ఈవో శ్రీనివాసరావు పాల్గొనడం శాస్త్ర విరుద్ధమని అర్చకులు అడ్డుకున్నారు. వెకిలి నవ్వులు నవ్వుతూ ఎగతాళి చేశారు. దీంతో పూజారులపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేశారు.
శ్రీశైలంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. దీంతో మొత్తం 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు.
తెలంగాణ భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ఆమె సందర్శించారు. తిరుమలలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరామన్నారు.