Amaravati: నేడు అమరావతి పునః నిర్మాణానికి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మైలురాయి నేడు ఆవిష్కృతమవుతోంది. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా నేడు అమరావతి పునర్నిర్మాణం మొదలు కానుంది.