AP : అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో తీస్తూ..!
సత్యసాయి జిల్లా వీరప్పగారి పల్లిలో అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని మనస్థాపం చెంది సెల్ఫీ వీడియో తీస్తూ ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.