/rtv/media/media_files/2026/01/27/municipal-election-code-2026-01-27-12-14-16.jpg)
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంటూ, పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈరోజు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న మీడియా సమావేశంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.
షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలులోకి రానుంది. దీనివల్ల ప్రభుత్వ కొత్త పథకాల ప్రకటనలు, బదిలీలపై నిషేధం ఉంటుంది. ఫిబ్రవరి మధ్య నాటికే ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం భావిస్తున్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నేడు అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. 116 పురపాలక సంఘాలు, 7 నగరపాలక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రకటనతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచనున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Follow Us