AP Liquor Scam: AP మద్యం కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. చెవిరెడ్డి ఫ్యామిలీ ఆస్తులు జప్తు

ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ ఆస్తులు జప్తుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

New Update
chevireddy

ఏపీ మద్యం కుంభకోణం(AP liquor scam case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(chevireddy-bhaskar-reddy)తో పాటు ఆయన కుటుంబ ఆస్తులు జప్తుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలిచ్చింది. కేవీఎస్‌ ఇన్‌ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. 

Also Read :  ఏపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం

Chevireddy Bhaskar Reddy Assets In AP Liquor Scam

చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా, కమీషన్ల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్‌ గుర్తించింది. రూ.54.87 కోట్లను నల్లధనంగా మార్చినట్లు తేల్చింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ఆస్తుల జప్తునకు ఆదేశించింది. అధికారం అండతో మోసపూరిత భూ లావాదేవీలు భారీగా చేసినట్లు సిట్‌ నిర్ధరించింది. అవినీతి నిరోధక, నేర చట్టాల సెక్షన్ల ప్రకారం జప్తునకు అనుమతించాలంది. సిట్‌ విజ్ఞప్తి మేరకు చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read :  ఏపీలో సంచలనం.. సిటీల్లోకి మావోయిస్టులు..పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక షెల్టర్లు

Advertisment
తాజా కథనాలు