Ap: ఏపీలో సంక్రాంతి సెలవుల పై బిగ్ ట్విస్ట్.. సర్కార్ కీలక ప్రకటన!

ఏపీ,తెలంగాణ సంక్రాంతి సెలవుల పై క్లారిటీ వచ్చేసింది. ఇరు ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులు ప్రకటించాయి. ఏపీలో10 రోజులు, తెలంగాణలో 7 రోజులు సెలవులు ప్రకటించారు.

New Update
pongal school holidays

pongal school holidays

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ అంటే చాలా పెద్ద పండగ. పల్లెల్లో సంక్రాంతి వేడుకలను ఘనంగా చేస్తారనే విషయం తెలిసిందే. ఉద్యోగాలు, చదువులు,ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు సంక్రాంతికి కచ్చితంగా సొంతూర్లకు వస్తారు. పండక్కి ఊరెళ్లేందుకు నెల రోజుల ముందుగానే ప్రణాళికలు సిద్దం చేసుకుంటారు. 

Also Read: BIG BREAKING: హోంమంత్రి పీఏపై అవినీతి ఆరోపణలు.. సర్కార్ సంచలన నిర్ణయం!

రైళ్లు, బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు చేసుకుంటారు. ఇక సంక్రాంతి పండగ గురించి అయితే పండగ సంగతి అటు ఉంచితే విద్యార్థులు సెలవుల కోసం ఎక్కువ ఎగిరి గంతేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగ తర్వాత సంక్రాంతికి ఎక్కువగా సెలవులు ఇస్తుంటారు. దీంతో ఆ పండగ అంటే విద్యార్థులు ఎంజాయ్ చేస్తారు.ఈ క్రమంలోనే ఏపీలో సంక్రాంతి సెలవులు గురించి గత కొద్ది రోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: Delhi Assembly Poll : నేడు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్.. ప్రకటించనున్న ఈసీ

10వ తేదీ  నుంచే సెలవులు..

ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం (AP Government) వీటి గురించి ఓ క్లారిటీ ఇచ్చింది. అకాడమిక్ క్యాలెండర్ (2024-25) ప్రకారం ముందుగా ప్రకటించినట్లుగానే జనవరి 10వ తేదీ  నుంచే సెలవులు  ప్రారంభం అవుతాయని ఓ ప్రకటనలో చెప్పింది. సెలవులు 19న ముగియగా, జనవరి 20వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయని అధికారులు అన్నారు.

ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా 10 రోజులపాటు స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అటు క్రిస్టియన్ పాఠశాలలకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు సెలవులు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే  తెలంగాణలో సంక్రాంతి సెలవులపై ఇంకా ఏ క్లారిటీ రాలేదు. స్కూళ్లకు సంక్రాంతి సెలవులు (Sankranti Holidays) తగ్గిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. నిజానికి అకడమిక్ క్యాలెండర్‌లో జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు

అయితే జనవరి 11న రెండో శనివారం, 12న ఆదివారం రానుంది. 13వ తేదీన భోగి, జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి రోజున జనరల్‌ పబ్లిక్‌ హాలిడేస్‌ ప్రకటించారు. ఇక జనవరి 15న కనుమ పండుగ సందర్భంగా ప్రభుత్వం ఆప్షనల్‌ హాలిడే ఉంది. కాబట్టి ఈరోజున కూడా కొన్ని పాఠశాలలు సెలవు ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇవన్నీ కలుపుకుంటే.. స్కూళ్లకు వరుసగా 7 రోజులు సెలువులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.

Also Read: CM Revanth: సీఎం పేరు మర్చిపోవడం కుట్ర.. వాడేం యాంకర్: ఎంపీ చామల సీరియస్ రియాక్షన్

Also Read: AP Sankranti Trains: 9 నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు