AP Sankranti Trains: 9 నుంచి ఏపీకి స్పెషల్ ట్రైన్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే!

సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి 6 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్లు ఈ నెల 8, 10, 11, 12 తేదీల్లో నడపనున్నారు. రేపు ఈ రైళ్ల అడ్వాన్స్ బుకింగ్ ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించనుంది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూడండి.

author-image
By Nikhil
New Update
SCR Special Trains

SCR Special Trains

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. సంక్రాంతి నేపథ్యంలో స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. తెలంగాణ ఏపీ మధ్య ఈ స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు తెలిపింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: అనకాపల్లి టూ ఆనందపురం హైవే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

రైళ్ల వివరాలు..

Train No.07653: కాచిగూడ-కాకినాడ టౌన్ స్పెషల్ ట్రైన్లను ఈ నెల 8, 11 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ట్రైన్లు ఆయా తేదీల్లో రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యానికి చేరుకుంటాయి.
Train No.07654: కాకినాడ టౌన్-కాచిగూడ ట్రైన్లను ఈ నెల 10, 12 తేదీల్లో నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు సాయత్రం 5.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు గమ్యానికి చేరుకుంటాయి.
ఇది కూడా చదవండి: AP: తెలుగులోనూ ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు– ఏపీ గవర్నమెంట్ ఆదేశాలు

ఈ నాలుగు రైళ్లు మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయని ప్రకటనలో పేర్కొన్నారు.

Train No.07023: హైదరాబాద్-కాకినాడ టౌన్ ట్రైన్ ను ఈ నెల 10న నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 18జ30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 7.10 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
Train No.07024: ఈ నెల 11న ఈ ట్రైన్ ను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. ఈ ట్రైన్ రాత్రి 8 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

ఈ రైళ్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు