Sankranti Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్..సంక్రాంతి సెలవులు పొడిగింపు..ఎన్నిరోజులంటే..!!
సంక్రాంతి పండగకు ఈసారి విద్యార్థులకు భారీగా సెలవులు వచ్చాయి. ఏపీలో వరుసగా 13రోజులు సెలవులు రానున్నాయి. తెలంగాణలో దాదాపు వారం రోజులు సెలవులు వచ్చాయి.
సంక్రాంతి పండగకు ఈసారి విద్యార్థులకు భారీగా సెలవులు వచ్చాయి. ఏపీలో వరుసగా 13రోజులు సెలవులు రానున్నాయి. తెలంగాణలో దాదాపు వారం రోజులు సెలవులు వచ్చాయి.
ఈరోజు నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలకు సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అలాగే.. ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి.
ఇంటర్ బోర్డు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జూనియర్ కాలేజీలు మూతపడనున్నాయి. 17వ తేదీన తిరిగి ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది