భద్రకాళీ చెరువుకు గండి, భయపడుతున్న కాలనీవాసులు
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో వరంగల్ జిల్లాలోని ప్రముఖ దేవాలయం అయినటువంటి భద్రకాళీ దేవాలయానికి ఆనుకొని ఉన్న భద్రకాళీ చెరువుకు గండిపడింది. దీని కారణంగా భద్రకాళీ దేవాలయానికి సమీపంలో ఉన్నటువంటి పోతన్ నగర్, సరస్వతి నగర్ వాసులకు ప్రమాదం పొంచి ఉంది. దీనికారణంగా పోతన్ నగర్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.