Rajinikanth: "50 ఏళ్ల లెజెండరీ జర్నీకి హాట్స్ ఆఫ్..!" మోడీ, చంద్రబాబు విషెస్ కు తలైవర్‌ రిప్లై ఇదే..

సూపర్ స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రయాణం సందర్భంగా సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ 'X'లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ నటన, సామాజిక స్పృహను ప్రశంసించారు. ఆయన్ని చూసి లక్షల మంది స్పూర్తి పొందారంటూ పేర్కొన్నారు.

New Update
Rajinikanth Chandrababu Modi

Rajinikanth Chandrababu Modi

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ గారి 50 ఏళ్ల సినీ ప్రయాణం, తాజాగా ఆయన చిత్రం కూలీ గ్రాండ్ రిలీజ్ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) గారు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గారు 'X'లో ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ తన సినీ జీవితాన్ని అనేక వినూత్న పాత్రలతో, సామాజిక స్పృహ కలిగిన చిత్రాలను ప్రజలకు అత్యంత చేరువ చేయడాన్ని చంద్రబాబు, మోదీ ప్రశంసించారు.

"సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి 50 అద్భుత సినీ సంవత్సరాల పూర్తి చేసిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయనే కాదు, ఆయన సినిమాలు కూడా సమాజంపై ప్రభావం చూపించాయి. ఆయన్ని చూసి లక్షల మంది స్పూర్తి పొందారు" అంటూ చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

సీఎం ట్వీట్‌కు స్పందనగా, రజనీకాంత్ కూడా గౌరవంతో మెసేజ్ ట్వీట్ చేశారు.

"గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, మీ మాటలు నాకు ఎంతో ప్రేరణనిచ్చాయి. మీ ప్రేమ, మద్ధతులతో నేను ఇంకా బాగా పని చేయాలన్న ఉత్సాహంతో ఉన్నాను. మీ సందేశానికి హృదయపూర్వక ధన్యవాదాలు " అని రజనీ ట్వీట్ చేశారు.

ఇదే రజనీకాంత్ మంచితనానికి ప్రతీక. ఎంత పెద్ద స్టార్ అయినా, ఆయనలో ఉన్న వినమ్రత, అభినయ పట్ల ఉన్న నిబద్ధత ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Also Read: 'కూలీ' బాక్సాఫీస్ రచ్చ.. మూడు రోజుల్లోనే ఎన్ని కోట్లంటే?

మోదీ స్పెషల్ విషెస్.. (PM Modi Wishes to Rajinikanth)

భారత సినీ రంగంలో అరుదైన మైలురాయి సాధించిన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

సినిమా పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, మోదీ గారు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ,

"రజనీకాంత్ గారి ప్రయాణం అత్యంత ప్రభావవంతమైనది. ఆయనే కాకుండా, ఆయన పోషించిన పాత్రలు కూడా కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. ఇటువంటి చరిత్రాత్మక సినీ జీవితం, ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన రజినీకాంత్ గారికి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుతున్నాను." అని పేర్కొన్నారు.

రజనీకాంత్ లాంటి గొప్ప నటుడికి దేశ ప్రధానమంత్రి నుంచి అభినందనలు రావడం అనేది రజిని సినీ ప్రస్థానం ఎంత గొప్పదో చెబుతోంది. ఈ విషయం అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది.

Also Read:రికార్డులు బద్దలు కొట్టిన రజినీ .. ఒక్కరోజుకే రూ. 150 కోట్లు!

ఇటీవల విడుదలైన ‘కూలీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకెళ్తుండటంతో పాటు, ఇలా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలపడం విశేషంగా మారింది.

'కూలీ' బాక్సాఫీస్ ర్యాంపేజ్..(Coolie Box Office Collections)

రజనీకాంత్ తాజా చిత్రం ‘కూలీ’, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఆగస్ట్ 14న విడుదలైన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹220 కోట్ల గ్రాస్, ₹118 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం, ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Also Read:అప్పుడే పైరసీ ఏంట్రా.. 'కూలీ',  'వార్ 2' HD ప్రింట్ లీక్!

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. రెండు రోజుల్లో ₹35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నాగార్జున విలన్‌గా, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో, అలాగే ఆమిర్ ఖాన్ ఓ క్యామియో పాత్రలో మెరిశారు.

50 ఏళ్ల లెజెండరీ జర్నీ..(Rajinikanth 50 Years Film Journey)

రజినీకాంత్ 50 ఏళ్ల సినీ జీవితం అనేది కేవలం గ్లామర్ షో కాదు అది ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. సామాన్యుడు హీరో ఎలా అవుతాడు? ప్రజల గుండెల్లో ఎలా స్థానం సంపాదిస్తాడు? అన్న మాటలకు రజినీ జీవితమే సాక్ష్యం. కమర్షియల్ సినిమాలతో పాటు సామాజిక బాధ్యత కలిగిన చిత్రాలను కూడా అందించిన రజినీకాంత్ ని ఎంత ప్రశంసించినా తక్కువే అవుతోంది.

Advertisment
తాజా కథనాలు