CRIME : తోడుంటాడని పెళ్లిచేసుకుంటే..రూ. 28 కోట్లు దోచుకున్నాడు..
జీవితంలో అందర్నీ కోల్పొయిన ఒక మహిళా శేషజీవితంలో తనకో తోడు కావాలనుకుంది. ఒక మ్యారేజ్ బ్రోకర్ద్వారా ప్రకటన ఇచ్చింది. తద్వారా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ, అతను ఆమెను వంచించి ఉన్నదంతా ఊడ్చుకొని పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Train Theft: చిత్తూరులో రెచ్చిపోయిన దొంగలు.. ట్రైన్ ఆపి మరీ...
ఏపీ లోని చిత్తూరు రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం అర్థరాత్రి దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ట్రైన్ ఆపి మరీ దొంగలు విరుచుకుపడ్డారు. బెంగళూరు వైపు వెళ్తున్న చామరాజు నగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 16219లో విద్యుత్తు సరఫరా ఆపేసి అందినకాడికి దోచుకున్నారు.
AP Crime : అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి....చంద్రబాబు సీరియస్
ఏపీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పు నియోజకవర్గంలో చోటు చేసుకోవడం గమనార్హం.
BIG BREAKING: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదురుగు స్పాట్ డెడ్!
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట నేషనల్ హైవేపై స్పీడ్గా వెళ్తున్న ఓ కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్లోనే మృతి చెందారు.
Electric shock : చిత్తూరులో దారుణం.. విద్యుత్ ఘాతానికి నాలుగేళ్ల బాలుడు మృతి
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అరవపల్లి గ్రామంలో ఘోరం జరిగింది. శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ఆవరణంలో ఆడుకుంటున్న రత్న కుమార్ నాలుగేళ్ల కుమారుడు గజముఖన్ కు విద్యుత్ షాక్ తగిలింది. అక్కడే పడిపోయిన బాలున్ని ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు డాక్టర్లు తేల్చారు.
AP : చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా సుమిత్ కుమార్ బాధ్యతలు.!
చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా సుమిత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు మధ్య కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు
Punganuru : బీసీవై నాయకురాలి పై వైసీపీ శ్రేణుల దాడి!
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బర్నేపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీసీవై పార్టీ నాయకురాలు అంజమ్మ పై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. వైసీపీ కి చెందిన చంద్రశేఖర్, పురుషోత్తం, చంద్రకళ, మంజుల, శంకరమ్మ అనే వ్యక్తులు అంజమ్మ పై వేట కొడవలితో దాడికి దిగారు.