/rtv/media/media_files/2025/05/04/n33Ixe6MbHtlWcJpQoHj.jpg)
East Godavari crime news
AP Crime: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఓ హత్య ఘటన సంచలనం రేపుతోంది. పట్టణానికి చెందిన ప్రముఖ వంట మాస్టర్ వలిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటనపై స్థానికుల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు.. నిడదవోలు వైయస్సార్ కాలనీకి చెందిన ఓ యువకుడు వలిపై గతంలో పోలీస్ కేసు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పాత కక్షలే హత్యకు కారణంగా ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు
పాత కక్షల నేపథ్యంలో..
వలి అనేక సంవత్సరాలుగా వంట మాస్టర్‌గా పని చేస్తూ తన జీవనం సాగిస్తున్నాడు. పలు కార్యక్రమాలకు వంట చేస్తూ వలీ స్థానికంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇలాంటి సమయంలో అతని హత్య జరగడం అందరిని కలచివేస్తోంది. హత్య జరిగిన తీరు చూస్తే.. ఇది ముందుగానే పక్కాగా ప్రణాళిక వేసుకున్న హత్యగా పోలీసులు భావిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న నిడదవోలు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రాథమికంగా ఇది పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పూర్తి విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. సాంకేతిక ఆధారంగా, సీసీ కెమెరాల దృష్ట్యా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: వేసవిలో గోండ్ కటిరా-పెరుగు తింటే ఈ సమస్యలు ఉండవు
ఈ హత్యపై పట్టణ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వలి ఓ సాదాసీదా జీవితం గడిపే వ్యక్తి అని, అతని మరణం వారి గుండెలను తాకిందని పలువురు స్థానికులు తెలిపారు. వలి మృతదేహం చూసి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని కుటుంబీకులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో నిడదవోలు పట్టణంలో పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: నిద్రపోయే ముందు ఇది పాలల్లో కలిపి తాగితే కొలెస్ట్రాల్ మాయం
( ap crime updates | ap-crime-news | ap-crime-report | ap crime latest updates | latest-news)
Follow Us