Ganesh Chaturthi : గణనాథునికి అపచారం.. మండపాల వద్ద చికెన్‌ బిర్యానీ భోజనాలు

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో గణేష్‌ మండపం  వద్ద చికెన్‌ తో భోజనాలు పెట్టడం వివాదస్పదమైంది. అయితే ఇది మండప నిర్వహకులు పెట్టింది కాదు. వైఎస్‌ వర్థంతి సందర్భంగా గణేష్‌ మండపాన్ని ఆనుకొని వైసీపీ నాయకులు ఈ భోజనాలు వడ్డించడం పట్ల భక్తులు మండిపడుతున్నారు.

author-image
By Madhukar Vydhyula
New Update
Chicken Biryani Meals at Ganesh Mandapam

Chicken Biryani Meals at Ganesh Mandapam

Ganesh Chaturthi :   దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత గణనీయంగా జరుగుతున్నాయి. నవరాత్రులు అనగానే అత్యంత నిష్టగా, భక్తితో భక్తులు పూజలు చేస్తారు. ఆయా మండపాల నిర్వహకులు తమ స్థోమతను బట్టి నవరాత్రుల్లో ఒకరోజు సాముహిక అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరికొందరు తొమ్మిది రోజులు అన్నదానం చేస్తారు. అయితే అది సాత్విక, పూర్తిగా శాఖహార భోజనాలు మాత్రమే వండుతారు. అయితే ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో మాత్రం దీనికి భిన్నంగా గణేష్‌ మండపం  వద్ద చికెన్‌ తో భోజనాలు పెట్టడం వివాదస్పదమైంది.

ఇది కూడా చూడండి:Chandra Grahan 2025: విచిత్రం.. చంద్ర గ్రహణాన్ని ఈ 15 నగరాల్లో స్పష్టంగా చూడొచ్చు..!

అయితే ఈ భోజనాలు మండప నిర్వహకులు పెట్టింది కాదు. మంగళవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్థంతి కార్యక్రమం సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు ఏర్పాటు చేయడం గమనార్హం. వైఎస్‌ వర్థంతి సందర్భంగా గణేష్‌ మండపాన్ని ఆనుకొని ఈ భోజనాలు వడ్డించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక మండపానికి సమీపంలో మాంసహార భోజనాలు ఎలా పెడుతారని స్థానికులు ప్రశ్నించినప్పటికీ వారు పట్టించుకోలేదన్న ఆరోపణలు వినపడుతున్నాయి. 

ఇది కూడా చూడండి:HYD CRIME: అయ్యో బిడ్డా.. స్తంభం కూలి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

భక్తులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక గాంధీసెంటర్‌లో గత నెల 27 న వినాయకచవితి సందర్భంగా వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు.ప్రతిరోజు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. అయితే మంగళవారం రాజశేఖర్‌ రెడ్డి వర్థంతిని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నివాళులు అర్పించే కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా వైఎస్‌ మొబైల్‌ విగ్రహాన్ని ప్రతిష్టించి పూలమాలలు వేశారు. అనంతరం గణేష్‌ మండపం పక్కనే చికెన్‌ బిర్యానీతో భోజనాలు ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వారి పార్టీ కార్యకర్తలకు వడ్డించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మండప నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక సీఐ తన సిబ్బందితో వచ్చి అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడ ఉన్న వాటర్‌ క్యాన్లు, ఇతర సామగ్రిని స్టేషన్‌కు  తరలించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహారించిన అరుణ్‌కుమార్, జగన్మోహనరావుతోపాటు మరో 20 మందిపై ఎస్సై శాతకర్ణి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి:ఇన్‌స్టా ప్రియుడికోసం.. కట్టుకున్నోన్ని వదిలేస్తానన్న భార్య... కోపంతో భర్త ఏం చేశాడంటే?

Advertisment
తాజా కథనాలు