HYD CRIME: అయ్యో బిడ్డా.. స్తంభం కూలి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

హైదరాబాద్‌లోని నాచారంలో కార్తికేయ నగర్‌కు చెందిన సత్విక్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బైక్ పై వెళ్తుండగా.. ఒక్కసారిగా రోడ్డు డివైడర్‌లో ఉన్న విద్యుత్ స్తంభం విరిగి అతనిపై పడింది. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు.

New Update
_HYD CRIME

HYD CRIME

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలయ్యాడు. మంగళవారం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్తికేయ నగర్‌కు చెందిన సత్విక్, తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఒక్కసారిగా రోడ్డు డివైడర్‌లో ఉన్న విద్యుత్ స్తంభం విరిగి అతనిపై పడింది. ఈ ఊహించని ఘటనలో సత్విక్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు.

విద్యుత్ స్తంభం విరిగి..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్విక్ తన బైక్‌పై వెళ్తున్న క్రమంలో.. బలహీనంగా ఉన్న విద్యుత్ స్తంభం ఒక్కసారిగా విరిగి అతనిపై పడింది. దీంతో బైక్‌ అదుపు తప్పి కింద పడగా.. తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సత్విక్‌ను పరిశీలించగా.. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు.

ఇది కూడా చదవండి: ఇన్‌స్టా ప్రియుడికోసం.. కట్టుకున్నోన్ని వదిలేస్తానన్న భార్య... కోపంతో భర్త ఏం చేశాడంటే?

సత్విక్ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నివాసం ఉండే కార్తికేయ నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నాచారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ స్తంభం ఎందుకు విరిగి పడింది, దాని నిర్వహణ లోపం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాల నాణ్యత.. వాటి నిర్వహణపై అధికారులు శ్రద్ధ పెట్టాలని స్థానికులు గుర్తుచేశారు. ఈ ప్రమాదంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: అయ్యో.. ఓనమ్ వేడుకల్లో విషాదం.. డాన్స్ చేస్తూ కుప్పకూలిన ఉద్యోగి!

Advertisment
తాజా కథనాలు