/rtv/media/media_files/2025/02/22/wtyOzIR2ASiyJuxKEzI7.jpg)
CM Chandrababu key suggestion to APPSC on Group 2 Mains Exam
APPSC: ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రోస్టర్‌లో తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణ సరికాదని చంద్రబాబు సర్కార్ ఏపీపీఎస్సీకి సూచించింది. అభ్యర్థుల వాదనను అర్థం చేసుకుని ఫ్రిబ్రవరి 23న జరిగే పరీక్షను వాయిదా వేయాలని చెప్పింది. అయినప్పటికీ ఏపీపీఎస్సీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఏపీపీఎస్సీపై గ్రూప్ 2 అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పరీక్ష వాయిదా వేయండి..
ఈ మేరకు రోస్టర్ విధానంలో తప్పులను గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఆందోళనలను పూర్తిగా పరిగణలోకి తీసుకుని గ్రూప్ 2 మెయిన్స్ ను వాయిదా వేయాలని కోరింది. ఇందుకు సంబంధించి లేఖ కూడా రాసింది. రోస్టర్ సమస్యను, అభ్యర్ధుల న్యాయబద్దమైన విన్నపాలను వివరిస్తూ పరీక్ష వాయిదా వేయాలని సూచించింది. అయితే నిన్ననే లేఖ రాసినా ప్రభుత్వ అభ్యర్థనపై ఏపీపీఎస్సీ స్పందించలేదు. లక్ష మంది ఆందోళనను ఏపీపీఎస్సీ పెద్దలు అర్థం చేసుకోకపోవడంతోపాటు ప్రభుత్వ లేఖపై ఇంతవరకు స్పందించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.
ఇది కూడా చదవండి: Wedding: పెళ్లిచేస్తాం, గిఫ్ట్‌లు ఇస్తామని నమ్మించారు.. చివరికి ఊహించని షాక్
సీఎం చంద్రబాబు సీరియస్..
అభ్యర్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఏపీపీఎస్సీ త్వరగా తన నిర్ణయాన్ని ప్రకటించాలని గ్రూప్ 2 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 23 ఉదయం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించేదుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తుండటంపై సీఎం చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనురాధ తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే మానవతా దృక్పథంతో స్పందించాలన్నారు. గ్రూప్-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రోస్టర్ రిజర్వేషన్లు తేల్చేవరకు వాయిదా వేయాలన్నారు. కానీ ఇప్పటికీ అనురాధ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. అభ్యర్థుల డిమాండ్లకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: Local Boy Nani: యూట్యూబర్ లోకల్‌బాయ్ నానికి బిగ్‌షాక్.. అరెస్టుకు రంగం సిద్ధం!