/rtv/media/media_files/2025/02/22/IyXl7N17lpYzpsA98mVn.jpg)
Wedding
ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలే కాదు.. వేరే మార్గాల్లో కూడా జనాలను మోసం చేస్తున్నాయి కొన్ని ముఠాలు. తాజాగా సామూహిక వివాహాలు చేస్తామని నమ్మించి పలు జంటలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దగ్గరుండి పెళ్లి చేసి కానుకలు కూడా ఇస్తామని, సామూహిక వివాహాలు ఏర్పాట్లు చేస్తామని, కట్నం కూడా ఇస్తామంటూ ఆశపెట్టారు. చివరికి ఎన్నో ఆశలతో వేదిక వద్ద వచ్చిన జంటలు తాము మోసపోయామని తెలుసుకోని కంగుతిన్నారు. ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది.
Also Read: కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు.. పార్టీపై శశిథరూర్ తీవ్ర అసంతప్తి!
ఇక వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని రాజ్‌కోట్, చుట్టుపక్కల ప్రాంతల్లో ఉండే ప్రజలకు.. కొందరు వ్యక్తులు సామూహిక పెళ్లిళ్లు జరిపించే నిర్వాహకులమని చెబుతూ నమ్మించారు. దగ్గరుండి పెళ్లి ఏర్పాట్లు చేస్తామని.. కానుకలు కూడా ఇస్తామని మభ్యపెట్టారు. వాళ్ల మాటలు నమ్మిన 28 జంటలు వివాహానికి సిద్ధమయ్యాయి. చెప్పిన తేదీకి వారు వేదిక వద్దకు వెళ్లారు. కానీ అక్కడ ఏం ఏర్పా్ట్లు కనిపించలేదు. దీంతో ఆ నిర్వాహకులకు ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. చివరికి వాళ్లు పోలీసులను ఆశ్రయించారు.
Also Read: డబ్బులు బొక్కా.. విరిగిపోయిన సీటు ఇచ్చారు.. ఎయిర్ ఇండియాపై కేంద్రమంత్రి ఫైర్!
ఆ నిర్వాహకులు ఒక్కొక్కరి నుంచి రూ.15 వేల దాకా వసూలు చేసినట్లు బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. ఆ తర్వాత వాళ్లకి వివాహాలు జరిపించే బాధ్యత పోలీసులు తీసుకున్నారు. కొన్ని జంటలు ఆలయాలు, ఇతర ప్రాంతాల్లోకి వెళ్లి వివాహం చేసుకున్నాయి. ఆరు జంటలకు పోలీసులే దగ్గరుండి పెళ్లి చేశారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని అసిస్టెంట్ కమిషనర్ రాధికా భరాయ్ తెలిపారు.
Also Read: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. హిడ్మా కూతురు సంచలన నిర్ణయం!
Also Read: కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!