VAYUPUTRA: మొన్న 'మహా అవతార్'.. ఇప్పుడు 'వాయుపుత్ర'.. 3D యానిమేషన్‌లో హనుమాన్ కథ!

'మహావతార్ నరసింహ' తరహాలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. 'వాయుపుత్ర' అనే పేరుతో 3D యానిమేషన్ సినిమాను ప్రకటించింది.

New Update
VAYUPUTRA

VAYUPUTRA

 ఇటీవలే విడుదలైన యానిమేషన్ సీరీస్  'మహావతార్ నరసింహ' ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. చిన్న బడ్జెట్ తో, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం  భారతీయ యానిమేషన్  చిత్రాలకు ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద యానిమేటెడ్ సీరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండదు అనే అపోహను తిప్పికోట్టింది.  ఇండియాలో భారీ వసూళ్లు సాధించిన హాలీవుడ్ యానిమేషన్ చిత్రాలు 'ది లయన్ కింగ్',  'స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్-వర్స్' వంటి సినిమాల రికార్డులను సైతం  బద్దలు కొట్టి భారతీయ యానిమేషన్ స్థాయిని పెంచింది.  తక్కువ బడ్జెట్  లో అద్భుతమైన  గ్రాఫిక్స్, యానిమేటిక్ విజువల్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది.  బాక్సాఫీస్ వద్ద  రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ యానిమేషన్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. 

ఇప్పుడు ఇదే తరహాలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది.  'వాయుపుత్ర' అనే పేరుతో యానిమేషన్ మూవీ రూపొందిస్తున్నట్లు ప్రకటించింది.  3D యానిమేషన్ లో రాబోతున్న ఈ చిత్రం ఒకేసారి 5 భాషల్లో విడుదల కానుంది.  డైరెక్టర్ చందు మొండేటి  'వాయుపుత్ర' వరల్డ్ ని తెరపైకి తీసుకొస్తున్నారు.  శ్రీరాముడికి వీర భక్తుడైన హనుమంతుడి జీవిత కథ ఆధారంగా ఇది తెరకెక్కనున్నట్లు  టైటిల్, పోస్టర్  చూస్తే అర్థమవుతోంది.

Also Read: K RAMP: కిరణ్ అబ్బవరం రొమాన్స్.. కె- ర్యాంప్ నుంచి ''కలలే కలలే'' సాంగ్ అదిరింది!

Advertisment
తాజా కథనాలు