YCP: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు AP: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను విమర్శిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారని టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై పోలీసులు కేసు బుక్ చేశారు. By V.J Reddy 09 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి YCP MLA Chandra Sekhar : సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటోంది చంద్రబాబు సర్కార్. ప్రభుత్వ పెద్దలపై, మహిళలు, అలాగే చిన్నారులపై అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది. తాటిపర్తి చంద్రశేఖర్ పై యర్రగొండపాలెంలో కేసు నమోదు అయింది. మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎక్స్ లో పోస్ట్ చేయడంపై టీడీపీ నేతపోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. కాగా ఒక ఎమ్మెల్యేపై కేసు నమోదు అవ్వడం ఇదే తొలిసారి. Also Read : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు హైదరాబాద్ వాసులు మృతి ఆయన ఏం పోస్ట్ చేశారు... సెప్టెంబర్ 18న యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో... "సర్కారు వారి పేకాట..... రాష్ట్రంలోని పేకాట క్లబ్ ల నుండి వారం వారం కమిషన్ వసూలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంత్రి శ్రీ నారా లోకేష్ గారు. విద్యాశాఖ మంత్రిగా ఉంటూ పేకాట ఆడేలా మౌలిక, సాంఘిక వసతులు ఏర్పాటు చేయడం ధర్మమా లోకేష్" అని పోస్ట్ చేశారు. Also Read : 'పుష్ప2' ఐటమ్ సాంగ్ లీక్.. శ్రీలీల, బన్నీ లుక్ మామూలుగా లేదు! సర్కారు వారి పేకాట.....రాష్ట్రంలోని పేకాట క్లబ్ ల నుండి వారం వారం కమిషన్ వసూలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంత్రి శ్రీ నారా లోకేష్ గారు. విద్యాశాఖ మంత్రిగా ఉంటూ పేకాట ఆడేలా మౌలిక, సాంఘిక వసతులు ఏర్పాటు చేయడం ధర్మమా @naralokesh గారు. — T Chandra Sekhar MLA (@TatiparthiOnX) September 18, 2024 Also Read : కార్తీక మాసంలో ఇంట్లో ఈ మొక్క నాటితే.. ఐశ్వర్య సిద్ధి తధ్యం! Also Read : ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? #nara-lokesh #chandrababu #social-media #ycp-mla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి