Karnataka లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు హైదరాబాద్ వాసులు మృతి కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కమలాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ యూసఫ్‌గూడకి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. By Bhavana 09 Nov 2024 in నేషనల్ క్రైం New Update షేర్ చేయండి Road Accident : కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా కమలాపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బొలేరో వాహనం కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందారు. Also Read: Ap Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడ్రోజులు వానలే..! వీరంతా కూడా నగరంలోని యూసుఫ్‌గూడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో నలుగురు స్పాట్ లోనే మృతి చెందారు. Also Read: ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన కర్ణాటకలోని వివిధ ప్రాంతాలను చూసేందుకు ఓ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు డ్రైవర్ తో కలిసి హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరింది. గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వీరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ అరెస్ట్? యూసఫ్‌గూడకు చెందిన భార్గవ కృష్ణ, ఆయన భార్య సంగీత, కొడుకు ఉత్తమ్ రాఘవ, కారు డ్రైవర్ రాఘవేంద్రగౌడ్ ఉన్నారు. వీరంతా హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెళ్తున్నారు. డబుల్ రోడ్డు అయినా మధ్యలో డివైడర్లు లేకపోవడంతో అటువైపు నుంచి వేగంగా వస్తున్న బొలేరో వాహనం కారును బలంగా ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాద ఘటనలో భార్గవ కృష్ణ కుటుంబంతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే కమలాపురం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. వాహనాలు పక్కకు తీసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బొలేరో రాంగ్ రూట్‌లో వచ్చినట్టు తేల్చారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. Also Read: Pushpa2: 'పుష్ప2' ఐటమ్ సాంగ్ లీక్.. శ్రీలీల, బన్నీ లుక్ మామూలుగా లేదు! Also Read: Mallareddy: మల్లారెడ్డితో పాటు ఆ 12 మెడికల్ కాలేజీలకు ఈడీ షాక్! #road-accident #karnataka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి