Vidadala Rajini Mass Warning | భయం నా బ్లడ్‌లోనే లేదు | Nara Lokesh | Srikrishna Devarayalu | RTV
AP: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను విమర్శిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారని టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై పోలీసులు కేసు బుక్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సొంత పార్టీ మీదే విమర్శనాస్త్రాలు సంధించారు. సొంత పార్టీ నేతలు బిల్లులు రాక ఆస్తులు అమ్ముకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.తన భవిష్యత్తు ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. ఈ లిస్టులో 50 నుంచి 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాళ లేదా రేపు వైసీపీ ఎమ్మెల్యేల ఫైనల్ లిస్ట్ వచ్చే ఛాన్స్.
ఎన్నికల వేళ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య టీడీపీలో చేరారు.
రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తుందని అసహనం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని. అందరూ కలిసి పని చేస్తానంటేనే వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుండి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అంతే తప్ప మరో నియోజకవర్గం నుండి ఎట్టి పరిస్థితిలోనూ పోటీ చేయనని తేల్చి చెప్పారు.