Amla: కార్తీక మాసంలో ఇంట్లో ఈ మొక్క నాటితే.. ఐశ్వర్య సిద్ధి తధ్యం!

కార్తీక మాసంలో ఉసిరి చెట్టును ఇంట్లో నాటడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. ఈ ఉసిరి చెట్టును పూజించి దీని నీడలో వనభోజనాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.

New Update
Karthika Masam 2023: కార్తీక మాసంలో గంగాస్నానం చేసి ఈ ఒక్క వస్తువు దానం చేస్తే చాలు..మీ పంట పండినట్లే..!!

హిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది. భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ఏడాది మొత్తం పూజలు చేస్తే ఎంత ప్రతిఫలం లభిస్తుందో.. కేవలం ఈ ఒక్క నెలలో పూజలు చేస్తే అంత ప్రతిఫలం వస్తుందని భక్తులు నమ్ముతారు. అయితే ఈ కార్తీక మాసంలో చాలామంది ఎక్కువగా వనభోజనాలకి వెళ్తుంటారు.

ఇది కూడా చూడండి: Medak District: కానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపంతో.. ఏం చేశాడంటే?

ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు చేస్తే..

ముఖ్యంగా ఉసిరికి చెట్టు దగ్గర భోజనాలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇదిలా ఉండగా కార్తీక మాసంలో ఉసిరికి చెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ చెట్టును ఇంట్లో నాటడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉసిరి చెట్టును ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం వల్ల ఇంట్లో లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. 

ఇది కూడా చూడండి: నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్.. యువ ఆటగాళ్లు రాణిస్తారా?

ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీ కటాక్షం ఉంటుందని నమ్ముతారు. డైలీ ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టడం వల్ల ఎలాంటి శత్రు బాధలు ఉండవు. ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలు చేస్తే అనేక రోగాల నుంచి విముక్తి పొందుతారని పండితులు అంటున్నారు. ఇంట్లో ఉసిరి మొక్క ఉండటం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. అలాగే కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. 

ఇది కూడా చూడండి: KCR: కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులివే.. విద్యుత్ కమిషన్ సంచలన నివేదిక!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఈ నియమాలు పాటించే ముందు పండితులను సంప్రదించడం మేలు.

ఇది కూడా చూడండి: తొలి టీ20లో భారత్ విజయం.. అదరగొట్టిన శాంసన్

Advertisment
Advertisment
తాజా కథనాలు