మూడు రాజధానుల విషయంలో వైసీపీ యూ టర్న్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటామని బొత్స సత్యనారాయణ ప్రకటించడం సంచలనం రేపుతోంది. పార్టీలో సమగ్రంగా చర్చించి తమ నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
AP YCP: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ స్టాండ్ మారుతోందా. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో పార్టీ యూ టర్న్ తీసుకుంటోందా? అమరావతిని ఏపీ రాజధానిగా వైసీపీ జై కొట్టనుందా అంటే తాజా పరిణామాలు చూస్తే అదే నిజమని తెలుస్తోంది. సోమవారం పార్టీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు ఇందుకు ఊతంగా కనిపిస్తున్నాయి. మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని.. వీటిపైనే ఎన్నికలకు వెళ్తామంటూ గత ఎన్నికల ముందు గంభీరంగా చెప్పి మట్టికరిచిన వైసీపీ ఇప్పుడు ఆ విషయంలో పునరాలోచనలో పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం కావడం, ప్రతిపాదిత మూడు రాజధానులకు ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతాల్లోనూ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడంతో తన విధానాలపై పార్టీ వెనక్కి తగ్గుతున్నట్లుంది. మూడు రాజధానులే తమ పార్టీ విధానమని ఇప్పటివరకు గట్టిగా చెప్పిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు స్వరం మారుస్తున్నారు.
అమరావతి శ్మశానంలా ఉంది..
రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటామని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అప్పట్లో ఉన్న పరిస్ధితులను బట్టి తాము మూడు రాజధానుల వైపు వెళ్లామని బొత్స అన్నారు. రాజధానిపై ఇప్పుడు తమ విధానం ఏమిటనేది చర్చించి చెబుతామని స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్టీలో సమగ్రంగా చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. అమరావతి శ్మశానంలా ఉందంటూ గతంలో తాను వ్యాఖ్యానించడం నిజమేనని అంగీకరించిన బొత్స.. ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి అలా మాట్లాడానన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అతి కీలకమైనది మూడు రాజధానులు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే.. విశాఖపట్నం కార్యనిర్వాహక, కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలని గతంలో భావించింది గానీ అది సాధ్యపడలేదు. వాస్తవ రూపాన్ని దాల్చలేదు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమిపాలు కావడానికి చంద్రబాబు అరెస్టుతో పాటు- మూడు రాజధానుల విధానం కూడా ఓ కారణమంటూ రాజకీయ విశ్లేషకులు విశ్లేషించారు. రాజధానులు చేయాలనుకున్న జిల్లాల్లో ఒక్క కర్నూలు మినహా మరెక్కడా కనీసం ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఖాతా కూడా తెరవలేకపోయింది వైసీపీ. పార్టీ సీనియర్లు సైతం ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ ఓటమి నేపథ్యంలో మూడు రాజధానుల విధానాన్ని వైసీపీ పునఃసమీక్షించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
కాగా, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అప్పట్లో నవ్యాంధ్రకు టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన అమరావతి రాజధానికి పూర్తిగా మద్దతు ప్రకటించింది. కానీ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత ఈ విషయంలో వైసీపీ మాటమార్చింది. అమరావతిపై లక్ష కోట్ల తమ ప్రభుత్వం ఖర్చుపెట్టలేదని, సంక్షేమ పథకాలకే తమ ప్రాధాన్యం అని స్పష్టం చేసింది. అమరావతికి లక్ష కోట్ల ఖర్చు పెట్టడానికి బదులు విశాఖపట్నంలో పరిపాలన రాజధాని పెట్టి కొద్దిగా నిధులు ఖర్చు చేస్తే విశాఖ దానికదే అభివృద్ధి చెందుతుందని అప్పటి సీఎం వైఎస్ జగన్ పలు సందర్భాల్లో చెప్పారు. అయితే అమరావతిలో అసెంబ్లీ ఉంచి శాసన రాజధానిగా కొనసాగిస్తామన్నారు. ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ ఇటు అమరావతి, అటు విశాఖ ప్రాంతాల్లో ఘోర ఓటమి చవి చూసింది. దీంతో ఆ పార్టీ రాజధాని విషయంలో రెండోసారి మాటమార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. తమ విధానాన్ని ప్రజలు తిరస్కరించడంతో వైసీపీ ఈ విషయంలో కచ్చితంగా అమరావతికి మద్దతిస్తూనే రాజధాని విషయంలో తమ సలహాలు, సూచనల పేరిట కొన్ని మార్పులు సూచించే అవకాశముందంటున్నారు.
AP YCP: వైసీపీ యూటర్న్.. అమరావతికి జై కొడుతున్న జగన్.. బొత్స సంచలన వ్యాఖ్యలు!
మూడు రాజధానుల విషయంలో వైసీపీ యూ టర్న్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటామని బొత్స సత్యనారాయణ ప్రకటించడం సంచలనం రేపుతోంది. పార్టీలో సమగ్రంగా చర్చించి తమ నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
Botsa Satyanarayana sensational comments on Amaravati capital
AP YCP: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ స్టాండ్ మారుతోందా. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో పార్టీ యూ టర్న్ తీసుకుంటోందా? అమరావతిని ఏపీ రాజధానిగా వైసీపీ జై కొట్టనుందా అంటే తాజా పరిణామాలు చూస్తే అదే నిజమని తెలుస్తోంది. సోమవారం పార్టీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు ఇందుకు ఊతంగా కనిపిస్తున్నాయి. మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని.. వీటిపైనే ఎన్నికలకు వెళ్తామంటూ గత ఎన్నికల ముందు గంభీరంగా చెప్పి మట్టికరిచిన వైసీపీ ఇప్పుడు ఆ విషయంలో పునరాలోచనలో పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం కావడం, ప్రతిపాదిత మూడు రాజధానులకు ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతాల్లోనూ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడంతో తన విధానాలపై పార్టీ వెనక్కి తగ్గుతున్నట్లుంది. మూడు రాజధానులే తమ పార్టీ విధానమని ఇప్పటివరకు గట్టిగా చెప్పిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు స్వరం మారుస్తున్నారు.
అమరావతి శ్మశానంలా ఉంది..
రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటామని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అప్పట్లో ఉన్న పరిస్ధితులను బట్టి తాము మూడు రాజధానుల వైపు వెళ్లామని బొత్స అన్నారు. రాజధానిపై ఇప్పుడు తమ విధానం ఏమిటనేది చర్చించి చెబుతామని స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్టీలో సమగ్రంగా చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. అమరావతి శ్మశానంలా ఉందంటూ గతంలో తాను వ్యాఖ్యానించడం నిజమేనని అంగీకరించిన బొత్స.. ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి అలా మాట్లాడానన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అతి కీలకమైనది మూడు రాజధానులు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే.. విశాఖపట్నం కార్యనిర్వాహక, కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలని గతంలో భావించింది గానీ అది సాధ్యపడలేదు. వాస్తవ రూపాన్ని దాల్చలేదు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమిపాలు కావడానికి చంద్రబాబు అరెస్టుతో పాటు- మూడు రాజధానుల విధానం కూడా ఓ కారణమంటూ రాజకీయ విశ్లేషకులు విశ్లేషించారు. రాజధానులు చేయాలనుకున్న జిల్లాల్లో ఒక్క కర్నూలు మినహా మరెక్కడా కనీసం ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఖాతా కూడా తెరవలేకపోయింది వైసీపీ. పార్టీ సీనియర్లు సైతం ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ ఓటమి నేపథ్యంలో మూడు రాజధానుల విధానాన్ని వైసీపీ పునఃసమీక్షించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also read : Hyderabad: చనిపోయిందా, చంపేశారా.. మిస్టరీగా మారిన శిరీష డెత్
అమరావతికి లక్ష కోట్ల ఖర్చు..
కాగా, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అప్పట్లో నవ్యాంధ్రకు టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన అమరావతి రాజధానికి పూర్తిగా మద్దతు ప్రకటించింది. కానీ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత ఈ విషయంలో వైసీపీ మాటమార్చింది. అమరావతిపై లక్ష కోట్ల తమ ప్రభుత్వం ఖర్చుపెట్టలేదని, సంక్షేమ పథకాలకే తమ ప్రాధాన్యం అని స్పష్టం చేసింది. అమరావతికి లక్ష కోట్ల ఖర్చు పెట్టడానికి బదులు విశాఖపట్నంలో పరిపాలన రాజధాని పెట్టి కొద్దిగా నిధులు ఖర్చు చేస్తే విశాఖ దానికదే అభివృద్ధి చెందుతుందని అప్పటి సీఎం వైఎస్ జగన్ పలు సందర్భాల్లో చెప్పారు. అయితే అమరావతిలో అసెంబ్లీ ఉంచి శాసన రాజధానిగా కొనసాగిస్తామన్నారు. ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ ఇటు అమరావతి, అటు విశాఖ ప్రాంతాల్లో ఘోర ఓటమి చవి చూసింది. దీంతో ఆ పార్టీ రాజధాని విషయంలో రెండోసారి మాటమార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. తమ విధానాన్ని ప్రజలు తిరస్కరించడంతో వైసీపీ ఈ విషయంలో కచ్చితంగా అమరావతికి మద్దతిస్తూనే రాజధాని విషయంలో తమ సలహాలు, సూచనల పేరిట కొన్ని మార్పులు సూచించే అవకాశముందంటున్నారు.
Also Read : టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్