Hyderabad: చనిపోయిందా, చంపేశారా.. మిస్టరీగా మారిన శిరీష డెత్

మలకపేట్‌లో వివాహిత మహిళ అనుమానస్పదంగా మృతి చెందింది. భర్త, అత్త మామ కొట్టి ఆమెను చంపి, గుండెపోటుతో చనిపోయిందని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వివాహిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా విషయం వెలుగులోకి వచ్చింది.

New Update
shirisha

Hyderabad

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మలక్‌పేటలోని ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. జమున టవర్స్‌లో సింగం శిరీష కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. భర్త, అత్త మామలు గుండె పోటుతో మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మృతదేహాన్ని సొంతూరుకి తరలించారు.

ఇది కూడా చూడండి: ఐదో సారి తల్లి కాబోతున్న సీమా హైదర్... తండ్రిగా సచిన్ మీనాకు ప్రమోషన్ !

కొట్టి చంపారని తల్లిదండ్రులు ఆరోపించగా..

శిరీష కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మధ్యలోనే అడ్డుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుండె పోటుతో తమ కూతురు మరణించలేదని, కొట్టి చంపారని శిరీష తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Blankets: దుప్పట్లు వాసన వస్తున్నాయా.. ఇలా చేస్తే సువాసన వెదజల్లుతాయి

ఇదిలా ఉండగా మహారాష్ట్రలోనూ ఓ దారుణ ఘటన జరిగింది. ఈర్ష్యతో 13 ఏళ్ల బాలుడు ఓ చిన్నారిని హతమార్చిన దారుణ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పాల్‌ఘర్‌ జిల్లాలో ఓ ఆరేళ్ల బాలికను కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా ముద్దు చేస్తుండేవారు. ఇది చూడలేని బాలుడు ఈర్ష్యతో ఆ బాలికను చంపాలని ప్లాన్ చేశాడు. 

ఇది కూడా చూడండి: Oscar Awards 2025 : ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం .. విజేతలు వీళ్లే!

ఈ క్రమంలో రామన్‌ రాఘవ్‌ అనే సినిమా చూసి మరి ఆరేళ్ల బాలికను దారుణంగా హత్య చేశాడు. సమీపంలో ఉన్న గుట్ట దగ్గరకు తీసుకుని వెళ్లి ఆమె ముఖంపై పెద్ద బండరాయి వేశాడు. దీంతో ఆ బాలిక అక్కడిక్కడే మరణించింది. బాలిక కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు