AP: హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి..!
శ్రీ సత్యసాయి జిల్లా దేమకేతేపల్లిలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేసారు ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి. ఎమ్మెల్యే బాలకృష్ణకు హ్యాట్రిక్ విజయం అందించినందుకు హిందూపురం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మరోసారి భరోసా ఇచ్చారు.