/rtv/media/media_files/2025/08/26/daughters-who-killed-their-mother-2025-08-26-18-27-37.jpg)
Daughters who killed their mother
Daughters Kill Mother: అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాటజంగాలపాలెం గ్రామానిక సమీపంలో ఇటీవల జరిగిన గుర్తు తెలియని మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ హత్యలో అసలు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ మహిళను చంపింది ఆమె సొంత కూతుర్లే కావడం సంచలనం రేపింది. తమ బాబాయ్ తో కలిసి వారు తల్లిని చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్యకు గురైన మహిళ విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలెం రాజీవ్‌నగర్‌కు చెందిన బంకిళ సంతు (సంతోషమ్మ)గా పోలీసులు తేల్చారు.
Also read: భారత్ అయిపోయింది..నెక్ట్స్ టార్గెట్ చైనా..ఆ కార్డులు వాడితే మటాష్ అంటున్న ట్రంప్
చాలా కాలంగా తల్లి కూతుళ్ల మధ్య ఆస్తి తగాదాలు, తల్లి ప్రవర్తనపై తీవ్ర అసహనంతో ఉన్నారు కూతుళ్లు. ఈ క్రమంలో తమ బాబాయ్ సహాయంతో తల్లి సంతు హత్యకు కూతుళ్లు ప్లాన్ చేశారు. వారి తల్లి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్థరాత్రి టవల్‌ను మెడకు బిగించి దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా, నిందితులు ఆ శవాన్ని షిఫ్ట్ కారులో తీసుకు వెళ్లి, బాటజంగాలపాలెం దగ్గర పెట్రోలు పోసి తగలబెట్టేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: పెళ్లయినా మరోకరితో అక్రమ సంబంధం...కూతురును..లవర్‌ను కొట్టిచంపిన తండ్రి
తల్లి ప్రవర్తనతో మనస్తాపం చెందిన కూతుళ్లు.. బాబాయ్‌తో కలిసి ఆమెను హత్య చేసినట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఒడిశాకు చెందిన బంకెల సంతు(37) తన భర్తతో విడిపోయి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి కుర్మానపాలెం వడ్లపూడి రాజీవ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. పెద్ద కూతురు అనూష ఓ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది. 15 ఏళ్ల చిన్న కూతురు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
ఇది కూడా చదవండి:కట్నం కోసం వేధింపులు.. నోట్లో వేడివేడి కత్తి పెట్టి.. ఇంకా చెప్పలేని ఘోరాలు!
తల్లి సంతు ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, చెడు వ్యసనాలకు లోనై డబ్బులు వృథా చేసింది. దీనిపై తరచూ సంతుకి మరిది మురళీధర్, ఇద్దరు కుమార్తెలకి మధ్య వివాదం జరిగేది. ఇటీవల తల్లి మొబైల్‌లో అసభ్యకర దృశ్యాలు ఉండటం చిన్న కూతురు గమనించింది.ఆ విషయాన్ని తన అక్కకు చెప్పడంతో ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. తల్లి ప్రవర్తనపై విసుగు చెందిన కుమార్తెలు బాబాయ్ మురళీధర్ సాయంతో అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 14న ఇంట్లో నిద్రిస్తున్న సంతుని హత్య చేసిన ముగ్గురు, మృతదేహాన్ని కారులో సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్దకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి దహనం చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: కొండల్లో చిక్కుకున్న వందలాది టూరిస్టులు.. విరిగిపడ్డ కొండచరియలు