Pawan Kalyan: మాట నిలిపి, సాయం అందించి.. జనసైనికుల కోసం పవన్ ఏం చేశారో తెలిస్తే!

పవన్ కళ్యాణ్ మంగళగిరి, కృష్ణా జిల్లాలో కుటుంబాలను కలిసి సహాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం బీమా, ఆర్థిక సాయం, ఉద్యోగ హామీల ద్వారా బాధిత కుటుంబాలకు ధైర్యం ఇచ్చారు. అభిమానులు, కార్యకర్తలు భారీగా హాజరై ఆయన మనవత్తనాన్ని చూసి ప్రశంసించారు.

New Update
Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: గత నెలలో మంగలగిరి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం, ఒక  కుటుంబాన్ని ఆయన వ్యక్తిగతంగా కలిసి ప్రోత్సాహం ఇచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ పాలనలో నిర్వహించిన జ‌న‌సేన ప్లీనరీ కోసం భూములు ఇచ్చిన కారణంగా ఇళ్లను కూల్చిన ఈ పరిస్థితిలో, పవన్ కళ్యాణ్ అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఆ సందర్భంలోనే స‌రస్వతమ్మ ఇంటికి వస్తానని మాటిచ్చారు, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ మాటను నిలబెట్టి ఆమె ఇంటికి వెళ్లి ఆశీర్వాదాలు అందించారు.

ఇక తాజాగా, జ‌న‌సేన పార్టీ క్రియాశీలక సభ్యుడు చందు వీరవెంకట వసంతరాయల కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ కలిసి ధైర్యం ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కృత్తివెన్నుకు చెందిన చందు, పార్టీ కార్యకర్తగా మాత్రమే కాకుండా సామాజిక సేవలోనూ గుర్తింపు పొందిన వ్యక్తి. ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తరువాత, పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున, వ్యక్తిగతంగా బీమా పరిహారం, ఆర్థిక సాయం అందించారు.

చందు వీరవెంకట వసంతరాయలు అవయవ దానం ప్రక్రియలో ముందుండి సహకరించినందుకు, పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబాన్ని అభినందించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని, ప్రభుత్వ స్థాయిలో సాయం, ఉద్యోగ అవకాశాల వంటి హామీలు కూడా ఇచ్చారు.

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు వేలాది అభిమానులు, పార్టీ కార్యకర్తలు వెళ్లి చూశారు. ఆయన ఈ పర్యటనను గోప్యంగా నిర్వహించినప్పటికీ, అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు.

పవన్ కళ్యాణ్ ఈ చర్యల ద్వారా తానూ ఇచ్చిన మాటను నిలుపుకున్నదే కాక, నిజమైన నాయకత్వం, మానవత్వం కూడా చూపించారని అభిమానులు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు