Tiger Bear Fight : బిడ్డపై కన్నేసిన పెద్దపులి..తన్ని తరిమికొట్టిన ఎలుగుబంటి

నల్లమల అడవిలో ఒక ఎలుగుబంటి తన బిడ్డతో కలిసి వెళుతుండగా పెద్దపులి ఎదురైంది. ఈ క్రమంలో పిల్ల ఎలుగుబంటి పై కన్నేసిన పులి దానిపై దాడి చేయబోయింది. అయితే వెంటనే రియాక్ట్‌ అయిన తల్లి ఎలుగుబంటి ఆ పులిని ఎదురించింది. పులిని తరిమికొట్టి తన బిడ్డను కాపాడుకుంది.

New Update
Tiger Bear Fight

Tiger Bear Fight

Tiger Bear Fight :  ఏ జీవి అయిన తన పిల్లల జోలికి మరో జీవి వస్తే ఊర్కొదు. తన ప్రాణాలను ఫణంగా పెట్టయినా కాపాడుకుంటుంది. అలాంటిదే శ్రీశైలం నల్లమల అడవుల్లో చోటు చేసుకుంది. నల్లమల అడవిలో ఒక ఎలుగుబంటి తన బిడ్డతో కలిసి వెళుతుండగా పెద్దపులి ఎదురైంది. ఈ క్రమంలో ఎలుగుబంటి పిల్లపై కన్నేసిన పులి దానిపై దాడి చేయబోయింది. అయితే వెంటనే రియాక్ట్‌ అయిన తల్లి ఎలుగుబంటి ఆ పులిని ఎదురించింది. తన బిడ్డను తన వెనుకకు పంపి పెద్దపులితో బాహాబాహికి దిగింది.

ఇది కూడా చదవండి: Balagam Actor: దీనస్థితిలో బలగం నటుడు..కిడ్నీలు ఫెయిల్.. గొంతు ఇన్ఫెక్షన్తో

తనకు బయపడి పారిపోతుందనుకున్న ఎలుగుబంటి తిరగబడటంతో  పులి అవక్కాయింది. ఈ క్రమంలో ఎలుగుబంటి, పెద్దపులి మధ్య కొంతసేపు ఫైటింగ్‌ చోటు చేసుకుంది. ఎలుగుబంటి తిరగబడడంతో పులి భయంతో  అడవిలోకి పరుగులు పెట్టింది. అయినా వదలకుండా దానివెంటపడటంతో పులి పారిపోయింది. పెద్దపులిని ఓడించి తన బిడ్డను కాపాడుకున్న ఎలుగుబంటి ధైర్యాన్ని కొంతమంది దూరం నుంచి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో అది వైరల్‌గా మారింది. క్రూర జంతువైన తన తల్లిప్రేమను రుజువు చేసుకుందని పలువురు నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..

ఇది కూడా చూడండి:TGCrime : భర్త ఫోన్ కు అశ్లీల ఫోటోలు పంపిన కానిస్టేబుల్‌...! ఉరేసుకుని భార్య...
 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు