/rtv/media/media_files/2025/02/08/nVrtpfOSK1kIPc21hNmq.jpg)
india batting coach sitanshu kotak reveals virat kohli fitness Photograph: (india batting coach sitanshu kotak reveals virat kohli fitness)
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత ఉత్రంఠత ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూసే ఈ మ్యాచ్ కు రెండు జట్టూ ప్రిపేర్ అవుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం దుబాయ్ లో మ్యాచ్ మొదలవుతుంది. అయితే దీనిలో ఇద్దరు ఆటగాళ్ళు ఆడతారా లేదా అనేది అనుమానంగా మారింది. అందులో ఒకరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అయితే రెండో వారు వికెట్ కీపర్ పంత్. ఇద్దరిలో ఏ ఒక్కరు ఆడకపోయినా కూడా జట్టుకు పెద్ద దెబ్బే అవుతుంది.
విరాట్ ఒక ధైర్యం..
విరాట్ కోహ్లీ జట్టులో అతి ముఖ్యమైన ప్లేయర్. అతను ఆడినా లేకపోయినా జట్టులో ఉంటే అదొక బలంగా ఉంటుంది. అవతల ప్రత్యర్థి ఎవరైనా కాస్త జాగ్రత్తగా ఉంటారు. అదే విరాట్ ఆడడం లేదు అంటూ హమ్మయ్య అనుకుంటారు. ఇది కోహ్లీ తన కెరీర్ లో సాధించిన పెద్ద విజయమనే చెప్పాలి. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోపీలో ఈ స్టార్ ఆటగాడు ఆడుతున్నా..ఈరోజు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో ఆడతాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రాక్టీస్ సమయంలో విరాట్ కాలికి దెబ్బ తగిలినట్టు కనిపించింది. అతను ఐస్ ప్యాక్ పెట్టుకుని ఎక్కువ సేపు కూర్చోవడం కనిపించింది. దీంతో ఈ అనుమానాలన్నీ మొదలయ్యాయి. అయితే బీసీసీఐ దీని గురించి ఏమీ అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఆడతాడనే అందరూ అనుకుంటున్నారు. ఏది ఏమైనా మ్యాచ్ ముందు వరకు తెలియదు.
వైరల్ తో బాధపడుతున్నాడు
ఇక వికెట్ కీపర్ పంత్ విషయానికి వస్తే..అతను హై ఫీవర్ తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని శుబ్ మన్ గిల్ కూడా ధృవీకరించాడు. వైరల్ ఫీవర్ కారణంగా పంత్ ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేదని, టెంపరేచర్ సైతం ఎక్కువగానే ఉందని గిల్ చెప్పాడు. బీసీసీఐ అతనికి చికిత్స అందిస్తూ జాగ్రత్తగా చూసుకుంటోంది. కానీ ఈ మ్యాచ్ సమయానికి పంత్ తేరుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే పంత్ లేకపోయినా పెద్ద నష్టమేమీ లేదు. ఎందుకంటే వికెట్ కీపింగ్ చేయడానికి కే ఎల్ రాహుల్ ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా ఇతనే వికెట్ కీపర్ గా ఆడాడు. పైగా అందులో 47 బంతుల్లో 41 పరుగులు కూడా చేశాడు. అందుకే ఈ మ్యాచ్ లో కూడా అతన్నే తీసుకుంటారని చెబుతున్నారు. అలాంటప్పుడు పంత్ ఆడకపోవడం పెద్ద ప్రభావం చూపించదని అంటున్నారు.
Also Read: Champions Trophy: నేడే ప్రత్యర్ధితో పోరు..గత ఫైనల్ ప్రతీకారం భారత్ తీర్చుకుంటుందా..