Mrs Telugu USA: మిస్‌ అండ్‌ మిసెస్‌ తెలుగు యూఎస్‌ఏ రన్నరఫ్ గా ఏపీ మహిళ

ప్రతిభ ఉంటే  ఏదైనా సాధించవచ్చని నిరూపించింది ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన మహిళ. దేశం కానీ దేశంలోనూ తన అందంతో అందరినీ ఆకట్టకోవడమే కాదు, అందానికి వయసుతో పనిలేదని నిరూపించింది కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక.

New Update
Mrs Telugu USA

Mrs Telugu USA

ప్రతిభ ఉంటే  ఏదైనా సాధించవచ్చని నిరూపించింది ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన మహిళ. దేశం కానీ దేశంలోనూ తన అందంతో అందరినీ ఆకట్టకోవడమే కాదు,అందానికి వయసుతో పనిలేదని నిరూపించింది కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక. అమెరికాలో నిర్వహించిన  మిస్‌ అండ్‌ మిసెస్‌ తెలుగు యూఎస్‌ఏ పాల్గొని రన్నరఫ్ గా నిలిచింది. మౌనిక ఉన్నత చదువులు చదవడమే కాదు. ఏపీపీఎస్సీలో మంచి ర్యాంకు సంపాదించి ఉద్యోగం కూడా చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని భర్తతో అమెరికా వెళ్లిపోయింది.

Also Read: సెక్స్ వర్కర్లలో తెలుగు స్టేట్స్ టాప్.. HIV కేసుల్లో ఇండియా నెం3!

Also Read :  మరో పాకిస్థానీ స్పై అరెస్ట్.. ఎక్కడంటే...

Miss and Mrs Telugu USA

అయినా తన ప్రతిభతో ఇంకా రాణిస్తూనే ఉంది.  గత నెల26 న అమెరికాల్లోని డల్లాస్‌లో ఇర్వింగ్‌ ఆర్ట్‌ సెంటర్‌లో జరిగిన మిస్‌ అండ్‌ మిసెస్‌ తెలుగు యూఎస్‌ఏ అందాల పోటీల్లో ద్వితీయ స్థానం కైవశం చేసుకొని అందరినీ ఆకట్టుకుంది. గుడివాడకు చెందిన అట్లూరి కృష్ణప్రసాద్, శైలజ దంపంతులకు మౌనిక, విద్యా సాహితి ఇద్దరు ఆడ పిల్లలు. వీరిలో మౌనిక బెంగళూరులో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి 2013లో ఏపీపీఎస్సీలో ఉద్యోగం సంపాదించి వరంగల్‌లో ఇరిగేషన్‌ ఏఈగా ఉద్యోగం కూడా చేసింది. అనంతరం మిషన్‌ భగీరథలో ఇంజినీర్‌గా పనిచేసిన ఆమెకు చెన్నైకి చెందిన పరుచూరి జితేంద్ర కుమార్‌తో 2014లో పెళ్లి జరిగింది. అయితే ఆయన ఉద్యోగ రీత్యా  అమెరికా వెళ్లడంతో ఆయనతో పాటు వెళ్లా్ల్సి వచ్చింది. దీంతో జాబ్‌ వదిలేసింది. భర్తతో 2017లో అమెరికా వెళ్లింది. అక్కడ కూడా తన ప్రతిభతో సేల్స్‌ ఫోర్సు కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించింది.  

Also Read: ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టి.. కాళ్లు పట్టుకున్న మహిళ - వీడియో వైరల్

చిన్నతనం నుంచి ఆమెకు ఆత్మవిశ్వాసం, సేవా లక్షణాలు ఎక్కువ. ఆ సేవా గుణంతోనే మౌనిక అమెరికాలో ఉన్నా నూజివీడులో స్నేహ రైడ్స్‌ సంస్థ నిర్వహిస్తున్న అనాథ పిల్లల ఆశ్రమానికి తనవంతు సాయం అందిస్తున్నారు. ఇక తన ప్రతిభ, అందంతో మౌనిక మిస్‌ అండ్‌ మిసెస్‌ తెలుగు యూఎస్‌ఏ అందాల పోటీల్లో పాల్గొంది. వేలాది మంది పాల్గాన్న ఈ పోటీలో వారందరిని దాటుకుని 25 మంది తుది జాబితాలో స్థానం సంపాదించుకుంది. అనంతరం గత నెల 26వ తేదీన జరిగిన తుది పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో గుడివాడలో ఆమె తల్లిదండ్రులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఆడవాళ్లు దేనిలోనూ తక్కువ కాదంటూ ఆత్మవిశ్వాసం వల్లే మౌనిక ఈ విజయం సాధించారని ఆమె పుట్టింటి వారు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: పైనాపిల్ తిన్న తర్వాత గొంతు దురద వస్తుందా? ఇది హెల్త్‌ను పాడు చేస్తుందా?

 

america | gudivada | beauty | telugu-women | Indian Nature Beauty | Beauty Queens

Advertisment
Advertisment
తాజా కథనాలు