AP Elections: నారాయణస్వామిపై తెలుగు మహిళల ఆగ్రహం... క్షమాపణలు చెప్పాలని డిమాండ్
భువనేశ్వరిపై మంత్రి నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలపై తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణస్వామి చిత్రపటాన్ని టీడీపీ నేత వంగలపూడి అనితతోపాటు తెలుగు మహిళలు చెప్పులతో కొట్టారు. భువనేశ్వరికి నారాయణస్వామి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సీఎం జగన్ మాదిరిగానే మంత్రులు కూడా సైకోలా మాట్లాడుతున్నారని అనిత విమర్శించారు.