Ap News: ఈగల్ వచ్చేస్తుంది..ఇక వారికి దబిడి దిబిడే! గంజాయి, డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడానికి ఈగల్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు హోం మంత్రి అనిత ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతిలో ఈగల్ కేంద్ర కార్యాలయం, జిల్లాలలో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. By Bhavana 29 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి దేశంలో జరుగుతున్న నేరాలలో సగం నేరాలు మత్తు వల్లే జరుగుతున్నట్లు పోలీసులు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అందుకే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు చేపట్టాయి. సోదాలు, తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి, డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు ఏపీలోనూ గంజాయి సాగు, అక్రమ రవాణా అనేది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఇప్పటికే అనేక చర్యలు చేపడుతున్న ఏపీ సర్కార్.. ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది. అదే.. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈగల్). Also Read:Telangana: పంచాయతీ ఎన్నికలపై సర్కార్ కీలక నిర్ణయం! డిస్ట్రిక్ట్ నార్కోటిక్ సెల్స్.. గంజాయి, డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడానికి ఈగల్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు హోం మంత్రి అనిత ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతిలో ఈగల్ కేంద్ర కార్యాలయం, జిల్లాలలో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అమరావతిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్, మిగతా 26 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈగల్ కోసం పనిచేసేందుకు సిబ్బందిని డిప్యుటేషన్ మీద తీసుకోనున్నట్లు తెలిపారు. అలాగే ఈగల్‌లో చేరే యూనిఫాం సర్వీస్ ఉద్యోగులకు 30 శాతం స్పెషల్ అలవెన్సు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక గంజాయి, డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి, విజయవాడలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. Also Read:Rain Alert : ఏపీకి తప్పిన తుపాను ముప్పు..ఈరోజు, రేపు భారీ వర్షాలు! మరోవైపు గంజాయి, మత్తుపదార్థాలు, సింథటిక్ డ్రగ్స్ పాటుగా నేరాల దర్యాప్తు, విచారణపై ఈగల్ ఫోర్స్ ఫుల్ ఫోకస్ పెట్టనున్నట్లు సమచారం. గంజాయి సాగు, అక్రమ రవాణా, కొనుగోలుదారులు, విక్రయదారులు, ఎవరు వాడుతున్నారనే దానిపై ఈగల్ కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. ఈగల్ ఫోర్స్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. Also Read:తెలంగాణకు కేంద్రం మరో తీపి కబురు.. అక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఈగల్ ఫోర్స్‌కు రూ.8.59 కోట్లు నిధులు కేటాయించారు. ఈగల్ ఫోర్స్ అదనపు డీజీ లేదా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో పనిచేస్తుంది. మొత్తం 459 మంది సిబ్బందిని కేటాయించారు. వీరిలో ఒక ఎస్పీతో పాటుగా అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు కూడా ఉంటారు. ఇక అమరావతిలో ఏర్పాటు చేసే ఈగల్ సెంట్రల్ ఆఫీసులో 24 గంటలూ సేవలు అందించేలా కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. Also Read:ప్రయాణించే రైళ్లు ఆలస్యంగా వెళ్తే నష్టపరిహారం పొందొచ్చు.. ఎలాగంటే? #cannabis #nara-lokesh #vangalapudi-anitha #drugs #eagle మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి