తెలంగాణకు కేంద్రం మరో తీపి కబురు.. అక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

తెలంగాణకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. విభజన హామీల్లో మరో హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది.

New Update
rail coach factory in kazipet

Kazipet Rail Coach Factory

తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్. రాష్ట్రానికి రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర విభజన హామీల్లో మరో హామీని నెరవేర్చింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. అలాగే మరోవైపు  ప్రస్తుతం అక్కడ ఉన్న ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్ గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

Also Read: యువతిని 40 ముక్కలుగా నరికి చంపిన ప్రియుడు.. కారణం ఏంటో తెలుసా?

ఇక అప్‌గ్రేడ్‌ చేయాలని 2023 జులై 5న రైల్వే బోర్డు దక్షిణ మధ్య రైల్వే జీఎంకి లెటర్ రాసింది. ఈ నేపథ్యంలోనే అప్‌గ్రేడ్‌ చేసిన యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌లు తయారు చేసేందుకు వీలుగా యూనిట్‌ను డెవలప్ చేయాలని ఈ సంవత్సరం అంటే 2024 సెప్టెంబరు 9న రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది. 

Also Read: జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా హేమంత్‌ ప్రమాణ స్వీకారం..రానున్న ఖర్గే,రాహుల్‌

ఈ మేరకు కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో LHB, EMU కోచ్‌ల తయారీకి సౌకర్యాలను డెవలప్ చేయడానికి ఒక ప్లాన్ రూపొందించాలని రైల్వే బోర్డు సూచించింది. ఇక విభజన హామీల అమలుపై రాష్ట్ర అధికారులు, కేంద్ర అధికారులతో హోంశాఖ నిర్వహించిన భేటీలో ఈ విషయం వెల్లడైంది.

Also Read:ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్.. టికెట్ ధరలపై 20 శాతం రాయితీ!

Also Read: అఖిల్‌ పెళ్లి గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు!

Advertisment
తాజా కథనాలు